SAIL Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
ఇంజనీర్లకు శుభవార్త!
★ SAIL Management Trainees (Technical) నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
◆ ఎలాంటి రాత పరీక్ష లేకుండా!, 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) ఖాళీల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) భారీ ప్రకటన..
◆ ఆసక్తి కలిగిన అభ్యర్థులు 03.11.2022 నుండి 23.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
◆ GATE - 2022 స్కోర్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
◆ ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000 నుండి రూ.1,80,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
సేయిల్ 245 మేనేజ్మెంట్ ట్రైనీ నోటిఫికేషన్ వివరాలు..
భారత ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ అయినా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్ గనులలో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్) శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గెట్-2022 ప్రామాణిక స్కోర్ కలిగిన, భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా గెట్ స్క్వేర్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 245,
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
విభాగల వారీగా ఖాళీల వివరాలు:
1. మెకానికల్ ఇంజనీరింగ్ (ME) - 65,
2. మెటలర్జికల్ ఇంజనీరింగ్ (MT) - 52,
3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (EE) - 59,
4. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (IN) - 13,
5. మైనింగ్ ఇంజనీరింగ్ (MN) - 26,
6. కెమికల్ ఇంజనీరింగ్ (CH) - 14,
7. సివిల్ ఇంజనీరింగ్ (CE) - 16.. మొదలగునవి.
తప్పక చదవండి :: NIC Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో 127 శాశ్వత సైంటిఫిక్ & టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
◆ 23.11.2022 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఆ వివరాలు;
● ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
● ఓబీసీ (నాన్-క్రిమిలేయర్) లకు 3 సంవత్సరాలు,
● దివ్యాంగులకు (జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు / ఎస్సీ/ ఎస్టీ లకు 15 సంవత్సరాలు/ ఓబీసీ (నాన్-క్రిమిలేయర్) లకు 13 సంవత్సరాలు),
● డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు.
తప్పక చదవండి :: HCL రాత పరీక్ష లేకుండా!, 84 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు!
◆ GATE-2022 ప్రామాణిక స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- నుండి రూ.1,80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.700/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.200/-.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.11.2022 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.sail.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment