BEL Hyderabad Unit Recruitment 2022 | BEL Hyderabad Unit 84 ఉద్యోగాల భర్తీ | Check eligibility criteria and Online Apply here..
![]() |
BEL Hyderabad Unit 84 ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ డిప్లమా" విభాగంలో ఖాళీగా ఉన్న "అప్రెంటిస్" పోస్టుల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వేరే రాష్ట్రాల్లో అప్రెంటిస్ శిక్షణలను చేయకుండా సొంత రాష్ట్రంలో రాష్ట్రంలో శిక్షణలు పూర్తిచేయడానికి ఈ దరఖాస్తులు తప్పక సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 84.
1. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగంలో..
✓ ఎలక్ట్రానిక్ - 35,
✓ CSE - 08,
✓ మెకానికల్ - 06,
✓ ఎలక్ట్రికల్ - 02,
✓ సివిల్ - 02.. ఇలా మొత్తం 53 ఖాళీలు..
2. టెక్నీషియన్ (డిప్లమా) అప్రెంటిస్ విభాగంలో..
✓ ఎలక్ట్రానిక్స్ - 14,
✓ మెకానికల్ - 13,
✓ సివిల్ - 02,
✓ DCCP - 02.. ఇలా మొత్తం 31 ఖాళీలు..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.
✓ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు.. సంబంధిత విభాగంలో ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
✓ ఎలక్ట్రానిక్ & టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్,
✓ టెలీకమ్యూనికేషన్ & ఇంజనీరింగ్,
✓ కంప్యూటర్ ఇంజనీరింగ్,
✓ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్,
✓ మెకానికల్ ఇంజనీరింగ్,
✓ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
✓ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్,
✓ సివిల్ ఇంజనీరింగ్,
✓ డిప్లమా ఇన్ కమర్షియల్ & కంప్యూటర్ ప్రాక్టీస్.. మొదలగు విభాగాల్లో 2020, 2021, 2022 అర్హత కలిగి ఉండాలి.
📌 ఇతర బ్రాంచీల్లో అర్హత కలిగిన అభ్యర్థులు రాత పరీక్షకు అనర్హులు..
తాజా ఉద్యోగాలు!
ఈ అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ లను నిర్వహిస్తున్న సంస్థ :: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ యూనిట్.
ఉద్యోగ ప్రదేశం :: హైదరాబాద్.
శిక్షణ కాలం :: ఒక (1) సంవత్సరం.
వయోపరిమితి:
✓ 01.03.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
📌 అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;
📍 ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
📍OBC లకు 3 సంవత్సరాలు
📍 PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NTAS) వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్ :: http://portal.mhrdnats.gov.in/
3. ఈ వెబ్ సైట్ నందు, ఇప్పటికే రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని ఉన్న అభ్యర్థులు, Login బటన్ పై క్లిక్ చేసి, సంబంధిత వివరాలతో లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించండి.
4. రిజిస్ట్రేషన్ నమోదు కోసం Enroll బటన్ పై క్లిక్ చేసి, సంబంధిత - వ్యక్తిగత, విద్యార్హత, ఫోటో, సిగ్నేచర్, అర్హత ధ్రువపత్రాల కాపీలు అప్లోడ్ చేస్తూ.. రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోండి.
5. విజయవంతంగా రిజిస్టర్ అయిన అభ్యర్థులు ప్రింటవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.
6. రాత పరీక్ష ఇంటర్వ్యూ సమయంలో ఈ ప్రింట్ అవసరం అవుతుంది గమనించండి.
ఎంపిక విధానం:
ఈ ప్రవేశాలకు ఎంపికలు "WALK-IN-INTERVIEW" రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
✓ రాత పరీక్ష లో సంబంధిత సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు.
✓ రాత పరీక్ష సమయం ఒక (1) గంట.
గౌరవ వేతనం:
అప్రెంటిస్ ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ సంవత్సరం పాటు ప్రతి నెల..
✓ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లకు రూ.11,110/-
✓ టెక్నికల్ (డిప్లమా) అప్రెంటిస్ లకు రూ.10,400/- చెల్లిస్తారు.
✓ క్యాంటీన్ / ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు కల్పిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 12.12.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.12.2022 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు.
పరీక్ష తేదీ, సమయం :: 23.12.2022 ఉదయం 09:30 నుండి.. మధ్యాహ్నం 02:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment