MCL - Mining Sirdar, Surveyor Jr.Overman 295 Posts Recruitment 2023 | 10+2, ITI, Diploma తో బొగ్గు గనుల శాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీ | Apply Online here..
![]() |
10+2, ITI, Diploma తో బొగ్గు గనుల శాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్(MCL) 10+2, ITI, డిప్లొమా పాస్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
10+2, ITI, డిగ్రీ, డిప్లమా(మైనింగ్ ఇంజనీరింగ్/ మైనింగ్/ మైన్స్ సర్వేయింగ్ (ఇంజనీరింగ్)) అర్హతలు కలిగిన అభ్యర్థులకు MCL 295 రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి, పోటీపడవచ్చు. రాత పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు, ప్రారంభ జీవితం రూ.31,852 - రూ.34,391 ఇవ్వనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలతో కూడిన సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 295.
విభాగాల వారీగా ఖాళీలు:
1. జూనియర్ ఓవర్ మెన్ - 82,
1. మైనింగ్ సిద్ధార్ - 145,
2. సర్వేయర్ - 68.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, 10+2/ తత్సమాన (లేదా) మైనింగ్/ మైన్స్ సర్వేయింగ్ ఇంజినీరింగ్ విభాగంలో డిప్లమా/ డిగ్రీ అర్హతలు కలిగి.. ప్రామాణిక(గ్యాస్ టెస్టింగ్/ ఓవర్ మెన్) సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు.
వయోపరిమితి:
23.01.2023 నాటికి 18-30 సంవత్సరాలకు మించకూడదు, అధిక పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3-15 సంవత్సరాల వరకు, సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
• రాత పరీక్ష మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటాయి.
✓ ఎలాంటి పర్సనల్ ఇంటర్వ్యూలు లేవు.
• రాత పరీక్ష MCQ, CBT రూపంలో ఉంటుంది.
• ప్రతి పోస్ట్ కు 100 మార్కులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
• జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ ల నుండి 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
• టెక్నికల్ నాలెడ్జ్ నుండి 80 ప్రశ్నలు అడుగుతారు.
✓ ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
✓ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
గౌరవ వేతనం:
• ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.31,852 - రూ.34,391 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
• కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్సులు వర్తిస్తాయి.
తాజా ఉద్యోగాలు!
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
• జనరల్ అభ్యర్థులకు జీఎస్టీ ఛార్జి తో కలిపి రూ.1180/-
• ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ ఈఎస్ఎం/ డిపార్ట్మెంటల్ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.01.2023 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.01.2023 రాత్రి 11:50 నిమిషాల వరకు.
అడ్మిట్ కార్డుల విడుదల తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
కంప్యూటర్ బేస్డ్(CBT) రాతపరీక్ష తాత్కాలిక తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
ఫలితాల విడుదల తాత్కాలిక తేదీ :: త్వరలో ప్రకటించబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://mahanadicoal.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment