WDCW Recruitment 2022 | తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీ | Check eligibility and Download Application form here..
![]() |
తెలంగాణ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
సొంత జిల్లాలో.. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి 'కాంట్రాక్టు ప్రాతిపదికన' నియామకాలు నిర్వహించడానికి, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 19, 2022 సాయంత్రం 05:00 గంటల లోపు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు.. దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు తదుపరి సమాచారం అందించడం జరుగుతుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 11.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
2. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్) - 01,
3. లీగల్-కం-ప్రొఫెషన్ ఆఫీసర్ - 01,
4. సోషల్ వర్కర్ - 01,
5. ఔట్ రిచ్ వర్కర్ - 05,
9. SAA సోషల్ వర్కర్ - 02.. మొదలగునవి.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి,
✓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో సోషల్ వర్క్(MSW)/ మాస్టర్ డిగ్రీ లో రూరల్ డెవలప్మెంట్/ సైకాలజీ/LLB/ LLM/ బ్యాచిలర్ డిగ్రీ సోషల్ వర్క్ చైల్డ్ డెవలప్మెంట్ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
01.07.2022 నాటికి 25 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ మరియు దివ్యాంగులకు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది).
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను విద్యార్హత అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపికైన అభ్యర్థులకు, రిజిస్టర్ మొబైల్ నెంబర్/ ఇమెయిల్ ఐడి లకు సమాచారాన్ని అందిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.10,400/- నుండి రూ.27.300/- వరకు ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.12.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 19.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
O/o the District Welfare Officer, WCD&SC, Interested District Office Complex, Anthaipally Village, Shameerpet Mandala, Medchal-Malkajgiri District, Telangana 500078.
అధికారిక వెబ్సైట్ :: https://wdcw.tg.nic.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment