TS Hostel Welfare Recruitment 2022 | సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Check eligibility and Apply here..
సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో 581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా మరియొక తాజా నోటిఫికేషన్ ను 581 పోస్టులతో 23.12.2022 విడుదల చేసింది. బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ అర్హతతో బిఎడ్/ డిఎడ్ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ సంక్షేమ హాస్టళ్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా 581 ఉద్యోగాల భర్తీకి తాజాగా 23.12.2022 న నోటిఫికేషన్ నెం.25/2022 అధికారికంగా విడుదల చేసింది నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచగల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.01.2023 నుండి 27.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. 2023 నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ మీ ఉద్యోగ దరఖాస్తులను స్వీకరించనుంది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తప్పక దరఖాస్తును సమర్పించి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందడానికి మన ...... వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 581.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 లో - 05,
2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 లో - 106,
3. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 మహిళలు (ఎస్సీ డెవలప్మెంట్) లో - 70,
4. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పురుషులు (ఎస్సీ డెవలప్మెంట్) లో - 228,
5. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (బిసి వెల్ఫేర్) లో - 140,
6. వార్డెన్ గ్రేడ్-1 డైరెక్టరేట్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ లో - 05,
7. మ్యాట్రన్ గ్రేడ్-1 డైరెక్టర్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ లో - 03,
8. వార్డెన్ గ్రేడ్-2 డైరెక్టర్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ లో - 03,
9. మ్యాట్రన్ గ్రేడ్-2 డైరెక్టర్ ఆఫ్ వికలాంగుల & సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ లో - 02,
10. లేడీ సూపరిటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 19.. ఇలా మొత్తం 581 పోస్టులను భక్తికి ప్రకటించింది.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్ డిగ్రీతో బీఈడీ/ బ్యాచిలర్ డిగ్రీతో స్పెషల్ బీఈడీ/ స్పెషల్ డిఈడి/ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
✓ కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్(CBRT)/OMR రూపంలో రతపరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి; ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ మొదలగునవి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.35,720/- నుండి రూ.1,12,510/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-,
✓ పరీక్ష ఫీజు రూ.80/-,
✓ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.01.2023.
అధికారిక వెబ్సైట్ :: https://websitenew.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి డైరెక్ట్ లింక్ :: త్వరలో అప్డేట్ చేయబడుతుంది.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment