NHPC Trainee Engineer and Officer Recruitment 2023 | బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాల భర్తీ | Check Salary and Apply Online here..
NHPC Job's 2023 | నేషనల్ హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్(ఎన్ హెచ్ పీ సీ)లో ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు..
బీఎస్సీ, బీఈ, బీటెక్ తో 401 శాశ్వత ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త..!
హర్యానాలోని ఫరీదాబాద్ లోగల నేషనల్ హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్(NHPC)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. NHPC వివిధ విభాగాలలో ట్రైనీ ఇంజనీర్, ట్రైనీ ఆఫీసర్స్ అర్హులైన అభ్యర్థుల నుంచి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 05 2023 నుంచి జనవరి 25 2023లోగా ఆన్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. అర్హత సాధించిన అభ్యర్థులకు నెలకు రూ.50,000/- నుంచి రూ.1,00,000/- వరకు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.
🔹 ఖాళీగా వున్న పోస్టులు: 401పోస్టులు.
🔹 పోస్టు పేరు: ట్రైనీ ఇంజినీర్ మరియు ట్రైనీ ఆఫీసర్స్.
🔹 విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
* ట్రైనీ ఇంజినీర్(సివిల్): 136పోస్టులు
* ట్రైనీ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 41పోస్టులు
* ట్రైనీ ఇంజినీర్(మెకానికల్): 108పోస్టులు
* ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్): 99పోస్టులు
* ట్రైనీ ఆఫీసర్(హెచ్ఆర్): 14పోస్టులు
*ట్రైనీ ఆఫీసర్(లా): 03పోస్టులు
🔹 విద్యార్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఐఏ మరియు సీఎమ్ఏ ఉత్తీర్ణతతోపాటు గేట్ -2022, యూజీసీ- నెట్ డిసెంబర్ 2021 జూన్ 2022, క్లార్క్ (పీజీ)2022 స్కోర్ కలిగి ఉండాలి.
🔹 వయో - పరిమితి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనవరి 25 2023 నాటికి 30ఏళ్లు మించకూడదు.
రేజర్వేషన్ అభ్యర్ధులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔹 ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, దృవ పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
🔹 దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది.
🔹 దరఖాస్తు ప్రారంభం:
జనవరి 05, 2022 దరఖాస్తులు ప్రారంభం.
🔹 దరఖాస్తు చివరి తేదీ:
జనవరి 25, 2023కు ముందుగా దరఖాస్తులను సమర్పించాలి.
🔹 దరఖాస్తు ఫీజు:
* దరఖాస్తు ఫీజు రూ.295/- చెల్లించాలి,
* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంటుంది.
🔹 జీతభత్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబధనల ప్రకారం రూ.50,000/- నుంచి రూ.1,00,000/- ల వరకు చెల్లిస్తారు.
🔹 అధికార వెబ్ సైట్: http://www.nhpcindia.com/
🔹 అధికార నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
🔹 ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment