TSPSC AMVI Recruitment 2022 | డిప్లమా, బీఈ, బీటెక్ తో 113 ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..
![]() |
డిప్లమా, బీఈ, బీటెక్ తో 135 ఉద్యోగాల భర్తీ |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో లో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తోంది.. తాజాగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (AMVI) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:31/2022, తేదీ: 31/12/2022 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 12/01/2023 నుండి 01/02/2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.45,969 నుండి రూ.1,24,150 వరకు జీతంగా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 113.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిప్లోమా/ మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
✓ ప్రామాణిక హెవీ మోటార్ వెహికల్(HMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 39 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాలు వరకు, ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సడలింపు లను కల్పించింది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
✓ OMR బేస్డ్ రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష ల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక లు ఉంటాయి.
✓ హాల్టికెట్లను పరీక్ష తేదీ లకు 7 రోజుల ముందుగా అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
పరీక్ష సెంటర్ :: హైదరాబాద్ మాత్రమే.
పరీక్ష సిలబస్:
✓ పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ సునంద 150 ప్రశ్నలు అడుగుతారు.
✓ ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
✓ పరీక్ష పేపర్ ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది.
✓ పేపర్-2 లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (డిప్లమా స్థాయి) నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
✓ ప్రతి ప్రశ్నకు రెండు(2) మార్కులు కేటాయించారు.
✓ పరీక్ష పేపర్ ఇంగ్లీషు మాత్రమే ఉంటుంది.
✓ పూర్తి వివరణత్మక సిలబస్ అధికారిక నోటిఫికేషన్ లో ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి వివరాలు తనిఖీ చేయండి.
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.45,960 - రూ.1,24,150 వరకు అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-.
✓ పరీక్ష ఫీజు రూ.120/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంప్రారంభం : 12/01/2023 ఉదయం 10:30 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 01/02/2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment