TSHC Recruitment 2023 | తెలంగాణ కోర్టులో 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాలు | Hurry Up! Registration Closed Soon..
TSHC Recruitment 2023 | తెలంగాణ కోర్టులో 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాలు..
![]() |
తెలంగాణ కోర్టులో 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాలు |
నిరుద్యోగులకు భారీ శుభవార్త!
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి, పోస్టుల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ దరఖాస్తులను స్వీకరించి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది. ఈ విషయం నిరుద్యోగ యువతకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇదే సమయంలో మిగిలిన ఖాళీల భర్తీకి సైతం నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లా కోర్టులో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి 1904 ఖాళీలను భర్తీ చేయడానికి ఒకేసారి ఆరు నోటిఫికేషన్లను జారీ చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో భర్తీ చేస్తున్న మీ ఉద్యోగాలకు ఈ నెల 11వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. వచ్చే నెల 15 నుండి హాల్టికెట్లను సైతం అందుబాటులో ఉంచి, మార్చి నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లాల వారీగా పోస్టుల వారీగా ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి, అధికారిక నోటిఫికేషన్లను దరఖాస్తు చేయడానికి ముందు తనిఖీలు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ.
ఖాళీల వివరాలువివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 1904.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫీల్డ్ అసిస్టెంట్ - 77,
2. జూనియర్ అసిస్టెంట్ 275,
3. రికార్డ్ అసిస్టెంట్ - 97,
4. ఎగ్జామినర్ - 66,
5. ప్రాసెస్ సర్వర్ - 163,
6. ఆఫీస్ సబార్డినేట్ - 1,226.. ఇలా మొత్తం 1,904 ఖాళీల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
వీటిలో మహిళలకు-891, పురుషులకు-1,013 పోస్టులు కేటాయించారు.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు/ ముఖ్య తేదీలు:
✓ ప్రకటన తేదీ : 02/01/2023.
✓ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11/01/2023.
✓ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31/01/2023.
✓ హాల్టికెట్లు డౌన్లోడ్ తేదీ : 15/02/2023.
✓ ఆన్లైన్ రాత పరీక్ష : మార్చి - 2023, (ఏ ఇతర కారణాల చేత పరీక్ష తేదీలను మార్చే అవకాశం ఉంటే అభ్యర్థులకు ముందుగా తెలియ పరచ బడుతుంది).
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01/07/2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలకు మించకూడదు.
✓ ఎస్సీ ఎస్టీ బిసి ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
✓ దివ్యాంగులకు 10 సంవత్సరాలు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
ఆన్లైన్ రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లో సూచించారు.
✓ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్/OMR రూపంలో ఉంటుంది.
✓ రాత పరీక్షలో కనీస అర్హత పొందడానికి ఈ క్రింది (పర్సంటేజ్) స్క్వేర్ చేయాలి.
• OC & EWS - 45%,
• BC - 35%,
• SC, ST & PH - 30%.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.600/-.
✓ ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ లకు రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.01.2023 ఉదయం 10:30 గంటలనుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31.01.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ లు..
1. ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
2. ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
3. రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
4. ఎగ్జామినర్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
5. ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
6. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment