TSPSC 544 Assistant Professor (Lecturers), Physical Director and Librarians Recruitment 2022 | Check eligibility and Apply online here..
![]() |
TSPSC 544 Assistant Professor (Lecturers), Physical Director and Librarians Recruitment 2022 | Check eligibility and Apply online here.. |
తెలంగాణ ప్రభుత్వం నుండి నిరుద్యోగులకు మరొక శుభవార్త!
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 544 ఉద్యోగాల భర్తీకి తాజాగా మరోక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 విభాగాల్లో మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 పరిధిలో ఈ ఖాళీలను సబ్జెక్టులవారీగా విడుదల చేసింది. సబ్జెక్టులను అనుసరించి వివిధ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 31.01.2023 నుండి 20.02.2023 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్లో త్వరలో అప్డేట్ చేయనుంది. అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ నోట్ ఆధారంగా ఖాళీల వివరాలను ఈ క్రింది విధంగా తెలిపింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఆ వివరాలు ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 544
సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు:
1. ఇంగ్లీష్ - 23,
2. తెలుగు - 27,
3. ఉర్దూ - 2,
4. సాంస్క్రిట్ - 5,
5. స్టాటిస్టిక్స్ - 23,
6. మైక్రో బయాలజీ - 5,
7. బయోటెక్నాలజీ - 9,
8. అప్లైడ్ న్యూట్రీషియన్ - 5,
9. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ - 311,
10. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - 39,
11. కామర్స్ - బిజినెస్ అనలిటిక్స్(స్పెషలైజేషన్) - 8,
12. డైరీ సైన్స్ - 8,
13. క్రాప్ ప్రొడక్షన్ప్రొడక్షన్ - 4,
14. డాటా సైన్స్ - 12,
15. ఫిషరీస్ - 3,
16. కామర్స్ - ఫారిన్ ట్రేడ్ (స్పెషలైజేషన్) - 1,
17. కామర్స్ - టాక్సేషన్ (స్పెషలైజేషన్) - 6,
18. ఫిజికల్ డైరెక్టర్ - 29,
19. లైబ్రేరియన్ - 24.. మొదలగునవి.
పూర్తి అర్హత ప్రమాణాలతో వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో రానుంది. ముందస్తుగా ఖాళీల వివరాలను ప్రకటిస్తూ అధికారికంగా ప్రెస్ నోట్ ను ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల చివరి వరకూ పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ అప్ డేట్ చేయబడుతుంది.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
ఖాళీల వివరాలతో అధికారిక ప్రెస్ నోట్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment