TSPSC Group-2 Services Notification for 783 Posts | తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల | Check eligibility and Apply online here..
![]() |
తెలంగాణ గ్రూప్-2 సర్వీసెస్ 783 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర లో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నియామకాలను చేపడుతున్న విషయం, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎంతో ఉత్సాహాన్ని కల్పిస్తోంది. తాజాగా గ్రూప్-2 సర్వీసెస్ నియామకాలకు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నా 783 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.28/2022, తేదీ:29/12/2022 ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరణాత్మక సమాచారం త్వరలో అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ఆధారంగా అభ్యర్థులు 783 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 18.01.2023 నుండి 16.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఉద్యోగార్థుల కోసం ఇక్కడ.. మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్లను పొందడానికి మన వెబ్సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
తాజా ఉద్యోగాలు!
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 783.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మున్సిపల్ కమిషనర్ డిపార్ట్మెంట్ లో - 11,
2. టాక్స్ డిపార్ట్మెంట్ లో - 59,
3. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో - 98,
4. సబ్-రిజిస్టార్ డిపార్ట్మెంట్ లో - 14,
5. కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో - 63,
6. లేబర్ డిపార్ట్మెంట్ లో - 09,
7. పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో - 126,
8. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో - 97,
9. హ్యాండ్లూమ్ & టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో - 38,
10. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో - 165,
11. లెజిస్లేటివ్ సెక్రటేరియట్ లో - 15,
12. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో - 25,
13. లా డిపార్ట్మెంట్ లో - 07,
14. తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో - 02,
15. జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 11,
16. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 17,
17. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో - 09,
18. ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో - 17.. ఇలా మొత్తం పైన పేర్కొన్న టువంటి 18 విభాగాల్లో 783 ఖాళీలను ప్రకటించింది.
గ్రూప్-2 సిలబస్:
✓ ఇందులో మొత్తం 4 పేపర్లు ఉంటాయి.
1. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ,
2. పేపర్-2 హిస్టరీ పాలిటిక్స్ & సొసైటీ,
3. పేపర్-3 ఎకానమీ & డెవలప్ మెంట్,
4. పేపర్-4 తెలంగాణ ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు..
✓ ప్రతి పేపర్ నుండి 150 ప్రశ్నల చొప్పున మొత్తం 600 ప్రశ్నలు అడుగుతారు.
✓ ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
✓ పరీక్ష సమయం ప్రతి పేపర్ కు 2:30 గంటలు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment