IB Recruitment 2023 | 10th పాస్ తో 1675 SA, MTS ఉద్యోగాల భర్తీ | Check Full Details and Apply Online here..
![]() |
10th పాస్ తో 1675 SA, MTS ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో/SIB లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్(SA/Exe) & మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్(MTS/Gen) ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పదవ తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ భారీ అవకాశాలను కల్పించనుంది. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ.
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
✓ 10వ తరగతి పాస్ తో స్థానిక భాష పై పట్టు ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరోబ్యూరో 1675 శాశ్వత కొలువుల తో నోటిఫికేషన్ను జారీ చేసి.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
✓ ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 28.01.2023 నుండి 17.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు.
✓ అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్స్ దిగువన ఉన్నవి చూడండి.
✓ Tier-1 & 2 పరీక్షల ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1675.
విభాగాల వారీగా(సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB)) ల వారీగా ఖాళీల వివరాలు:
1. అగర్తల - 13,
2. అహ్మదాబాద్ - 41,
3. ఐజ్వాల్ - 13,
4. అమృత్సర్ - 64,
5. బెంగళూర్ - 110,
6. బోపాల్ - 38,
7. భువనేశ్వర్ - 13,
8. చండీఘర్ - 36,
9. చెన్నై - 113,
10. డెహ్రాడూన్ - 13,
11. ఢిల్లీ/ IB Hqrs - 319,
12. దిబ్రూగఢ్ - 08,
13. గ్యాంగ్ టాక్ - 13,
14. గౌహతి - 45,
15. హైదరాబాద్ - 48,
16. ఇంపాల్ - 18,
17. ఇటానగర్ - 32,
18. జైపూర్ - 30,
19. జమ్ము - 02,
20. కలింపొంగ్ - 01,
21. కోహిమ - 12,
22. కోల్కత్తా - 90,
23. లేఖ్ - 16,
24. లక్నో - 50,
25. మీరట్ - 21,
26. ముంబై - 182,
27. నాగపూర్ - 02,
28. పాట్నా - 47,
29. రాయపూర్ - 22,
30. రాంచీ - 15,
31. షిల్లాంగ్ - 22,
32. సిమ్లా - 10,
33. సిల్లగురి - 11,
34. శ్రీనగర్ - 25,
35. త్రివేండ్రం - 132,
36. వారణాసి - 41,
37. విజయవాడ - 07.. మొదలగునవి.
• సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్(SA/Exe) లో మొత్తం - 1525,
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్(MTS/Gen) లో మొత్తం - 150.
విద్యార్హత:
✓ ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి మెట్రిక్యులేషన్(10వ తరగతి పాస్) సర్టిఫికెట్ కలిగి, స్థానిక భాష పై పట్టు ఉండాలి.
✓ ఇంటెలిజెన్స్ ఫీల్డ్ వర్క్ అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
10.02.2023 నాటికి 18 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్ష/ స్థానిక భాష పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
✓ రాత పరీక్ష Tier-1, Tier-2, MCQs రూపంలో నిర్వహిస్తారు.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
గౌరవ వేతనం:
✓ సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పై లెవెల్-3, ప్రకారం రూ. 21,700 నుండి 69,100 వరకు.
✓ మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్-1, ప్రకారం రూ.18,000 నుండి రూ.56,900 వరకు.. కేంద్ర ప్రభుత్వం అన్ని అలవెన్స్ లతో కలిపి ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ అన్ని వర్గాల అభ్యర్థులకు రూ.450/-.
✓ జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి(పురుష) అభ్యర్థులకు రూ.500/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 28.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.mha.gov.in/ & https://www.ncs.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment