Free Training for TSPSC Group-II - 2023 | టిఎస్ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | Hurry Up! Registration Closed Soon..
![]() |
టిఎస్ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల విడుదల చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను చూసి నిరుద్యోగ యువత సంతోషాన్ని వ్యక్తపరుస్తుంది, రాష్ట్రవ్యాప్తంగా పలు రకాల ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిస్తూ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) Group 1, 2, 3, 4 నోటిఫికేషన్లను విడుదల చేసి, ఉద్యోగ నియామకాలను వేగవంతం చేస్తుంది .. తాజాగా గ్రూప్ 1 ఉద్యోగాలకు ప్రిలిమినరీ-2022 తుది ఎంపిక జాబితాను సైతం విడుదల చేసింది. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ లను అందించడానికి నిరుద్యోగ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను జారీ చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా డిగ్రీ స్థాయి అర్హత సాధించిన అకడమిక్ మార్కుల పర్సంటేజ్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసే ఎంపిక చేయనున్నారు..
Group-II ఉద్యోగ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు:
◆ ఏపీ/ ఎస్సీ/ మరియు బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
◆ అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి పైబడి ఉండాలి.
◆ దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5.00 లక్షలకు మించకూడదు.
◆ ఇప్పటికే ఉచిత శిక్షణ ను తీసుకొని ఉన్న వారు మరలా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
◆ అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
ముఖ్య తేదీలు:
◆ నోటిఫికేషన్ విడుదల : 12.01.2023.
◆ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 20.01.2023.
◆ ఎంపిక జాబితా ప్రకటన : 21.01.2023.
◆ శిక్షణలు ప్రారంభమవు తేదీ : 23.01.2023.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
తాజా ఉద్యోగాలు!
విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ
దరఖాస్తు లో భాగంగా ఈ క్రింది అర్హత పత్రాల కాపీలను ఆన్లైన్లో సమర్పించాలి.
◆ కుల ధ్రువీకరణ పత్రం,
◆ నేటివిటీ సర్టిఫికెట్,
◆ ఆదాయ ధ్రువీకరణ పత్రం,
◆ పదవ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ధ్రువపత్రాల మెమోలు,
◆ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్,
◆ ఇటీవల దిగిన పాస్ ఫోటో, సంతకం, ఆధార్ కార్డులను మొదలగునవి.
నిరుద్యోగులు/ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే సంబంధిత మరియు సందేహాల నివృత్తి కోసం 040-24071178 నెంబర్ కు సంప్రదించవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment