TSPSC Physical Director Recruitment 2022 | మాస్టర్ డిగ్రీతో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ | Hurry Up! Registration Closed Soon..
![]() |
మాస్టర్ డిగ్రీతో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ |
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్య సాంకేతిక విద్య విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్.26/2022, తేదీ: 28.12.2022ను జారీ చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 128 ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు 06.01.2023 నుండి, 27.01.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. కంప్యూటర్ బేస్డ్ (CBT)/మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ రూపంలో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు, బేసిక్ పే రూ.54,220/- నుండి రూ.1,33,630/- ప్రకారం ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 128.
పోస్ట్ పేరు :: ఫిజికల్ డైరెక్టర్.
విభాగాల వారీగా ఖాళీలు:
1. టెక్నికల్ విద్యా విభాగంలో ఫిజికల్ డైరెక్టర్లు - 37,
2. ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో ఫిజికల్ డైరెక్టర్లు - 91.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
✓ ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో మాస్టర్ డిగ్రీ,
✓ M.A/ M.Sc/ M.Com విభాగం లో మాస్టర్ డిగ్రీ అర్హతతో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET), అలాగే SLET/ SET/ (లేదండి)Ph.D,
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3 నుండి పని సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
✓ రాతపరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది.
✓ పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ స్టడీస్ నుండి 150 ప్రశ్నలు.
• మొదటి పేపర్లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
✓ సంబంధిత సబ్జెక్ట్(ఫిజికల్ ఎడ్యుకేషన్ (M.P.Ed) లెవెల్) నుండి 150 ప్రశ్నలు
• రెండవ పేపర్లో ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయించారు.
✓ మొత్తం 450 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
✓ పరీక్ష సమయం 150+150 (150) నిమిషాలు.
✓ పేపర్-1, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలలో ఉంటుంది.
✓ పేపర్,-2, ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.
సిలబస్:
పూర్తి సిలబస్ వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు పే స్కేల్ ప్రకారం..
✓ టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఫిజికల్ డైరెక్టర్ గా ఎంపికైన వారికి రూ.56,100/- & రూ. 57,700/-..
✓ ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో ఫిజికల్ డైరెక్టర్లు గా ఎంపికైన వారికి రూ.54,200/- నుండి రూ.1,33,630..
వరకు ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి ఉచితంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-.
✓ పరీక్ష ఫీజు రూ.120/-.
✓ నిరుద్యోగులకు పరీక్ష ఫీజు (రూ.120/-) మినహాయించారు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 27.01.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment