TSHC Recruitment 2023 | 7th, 10th, డిగ్రీ పాస్ తో 174 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ | Check Full Details here.
![]() |
7th, 10th, డిగ్రీ పాస్ తో 174 ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్ |
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న ఉద్యోగ కుంభమేళ లో భాగంగా ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి దరఖాస్తులను స్వీకరించి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తూ వస్తోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం తెలంగాణ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న 1904 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఆరు నోటిఫికేషన్లను జనవరి 2, 2023న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర హైకోర్టులో ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను వరుసగా విడుదల చేసింది. 7వ తరగతి, 10వ తరగతి, గ్రాడ్యుయేషన్ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 21.01.2023 నుండినుండి 11.02.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం పే స్కేల్ ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 174.
పోస్టుల వారీగా విద్యార్హత/ ఖాళీల వివరాలు:
1. 7 నుండి 10వ తరగతి అర్హత తో.. ఆఫీస్ సబార్డినేట్ లో - 50,
2. ఏదైనా డిగ్రీ అర్హత తో.. కోర్ట్ మాస్టర్/ పర్సనల్ సెక్రెటరీ లో - 20,
3. ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ లా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత తో.. అసిస్టెంట్ లో - 10,
4. ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ లా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత తో.. అప్పర్ డివిజన్ స్టేనో లో - 02,
5. ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత తో.. ఎగ్జామినర్ లో - 17,
6. కంప్యూటర్ విభాగంలో ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ డిగ్రీ అర్హత తో.. కంప్యూటర్ ఆపరేటర్ లో - 20,
7. 5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల డిగ్రీ, డిప్లొమా అర్హత తో.. ట్రాన్స్లేటర్ (తెలుగు) మరియు ట్రాన్స్లేటర్ (ఉర్దూ) లో - 08,
8. B.Li.Sc & LL.B అర్హత తో.. అసిస్టెంట్ లైబ్రేరియన్ లో - 02,
9. బిఎస్సి (ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్)/ ఐటీ (లేదా) CSE/ IT/ ECE విభాగంలో ఇంజనీరింగ్ అర్హత తో.. సిస్టం అసిస్టెంట్ లో - 45.. మొదలగునవి.
✓ ఇలా మొత్తం175 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
వయోపరిమితి:
✓ 11.01.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
✓ అధికమైన పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
పోస్ట్ లను అనుసరించి రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.600/-,
✓ రిజర్వేషన్ వర్గాలవారికి రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.02.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
![]() |
తెలంగాణ కోర్టులో 7th, 10th, ఇంటర్, డిగ్రీ తో 1904 శాశ్వత ఉద్యోగాలు |
తెలంగాణ జిల్లా కోర్టులో 1904 ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment