SAMEER Project Staff Recruitment 2023 | ITI, బీఈ, బీటెక్ తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check Salary and Others Details here..
![]() |
ITI, బీఈ, బీటెక్ తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ |
ITI & బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు..
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ మరియు రీసెర్చ్.. కలకత్తా సెంట్రల్ లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 28.01.2023(ఆదివారం) నాటికి స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ (లేదా) నేరుగా దరఖాస్తు సమర్పించవచ్చు.. షార్ట్ లిస్టింగ్/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక నిర్వహించనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు.. పోస్టులను అనుసరించి రూ.15,100 నుండి రూ.30,000 వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా పోస్టుల వివరాలతో మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 35.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ ప్రాజెక్ట్ టెక్నీషియన్-A ఈ విభాగంలో..
1. మెకానికల్ (ఫిట్టర్ & మెకానిక్) - 03,
2. ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ - 01.
✓ ప్రాజెక్ట్ అసిస్టెంట్-A విభాగంలో
3. ఎలక్ట్రానిక్స్,/ కమ్యూనికేషన్/ టెలీకమ్యూనికేషన్ - 08,
4. మెకానికల్ - 04.
✓ రీసెర్చ్ సైంటిస్ట్ విభాగంలో..
5. ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ టెలీకమ్యూనికేషన్ - 19. మొదలగునవి.
విద్యార్హత:
✓ ప్రాజెక్ట్ టెక్నీషియన్-A పోస్టులకు, సంబంధిత విభాగంలో ఐటిఐ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
✓ ప్రాజెక్ట్ అసిస్టెంట్-A పోస్టులకు, మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా అర్హత కలిగి ఉండాలి. లేదా తత్సమాన అర్హత ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
✓ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు, B.E/ B.Tech, M.E/ M.Tech విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ & అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ తత్సమాన విభాగాల్లో కనీసం 55 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
✓ సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి పోస్టులను అనుసరించి 25- 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, రూ.15,100 నుండి రూ.30,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.01.2023 (ఆదివారం) సాయంత్రం 4:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
Socity for Applied Microwave Electronics Engineering and Research Plot - L2,Block - GP, Sector - V, Salt Lake Electronics Complex Kolkata - 700091.
సందేహాల నివృత్తి కోసం ఈ నెంబర్ 033 2357 4875/ 4894 ను సంప్రదించండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.sameer.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారికి దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment