Yantra India Limited 5450 Vacancies Recruitment 2023 | 10th, ITI తో 5450 ఉద్యోగాల భర్తీ కి భారీ ప్రకటన | Check Full Details here..
![]() |
10th, ITI తో 5450 ఉద్యోగాల భర్తీ కి భారీ ప్రకటన |
10th, ITI అర్హతలతో దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. భారత రైల్వే తో సహా ప్రముఖ సంస్థలు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. తాజాగా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్ నూతన సంవత్సర ప్రారంభంలో 5,395 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా 57వ బ్యాచ్ అప్రెంటిస్షిప్ శిక్షణల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది(1,956 Non-ITI & 3,514 Ex-ITI) విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు అధికారిక నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది. ఈ అప్రెంటిస్షిప్ శిక్షణను పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకోవచ్చు.. భారీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రెంటిస్ శిక్షణ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి.. 10వ, తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన అర్హతలతో అప్రెంటిస్షిప్ శిక్షణ సర్టిఫికెట్ కలిగి ఉండటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5,395.
Non-ITI & Ex-ITI విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
✓ Non-ITI విభాగంలో - 1,887,
✓ Ex-ITI విభాగంలో - 3,508,
తెలంగాణ లో - 438. ఖాళీలు ఉన్నవి.
విద్యార్హత:
Non-ITI విభాగంలో సీట్ల కోసం; కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ సర్టిఫికెట్ కలిగి, మ్యాథ్స్ & సైన్స్ సబ్జెక్టు లో 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
Ex-ITI విభాగంలో సీట్ల కోసం; కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి/ ITI అర్హత కలిగి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(SCVT) నుండి సంబంధిత ట్రేడ్ విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ దరఖాస్తు తేదీ నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుడదు.
✓ అధికమైన పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలను అధికారులు నోటిఫికేషన్ చదవండి.
పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ అధికారిక వెబ్ సైట్ నందు జనవరి 4వ వారం 2023 నాటికీ అప్డేట్ లో రానున్నట్లు నోటిఫికేషన్లో సూచించడమైనది.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అభ్యర్థులు ఎవరైతే ఇప్పటికే భారత ప్రభుత్వ అప్రెంటిస్షిప్ https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు కలిగియున్నారో(దరఖాస్తు చేసి ఉన్నారు).. వారు మరల భారత ప్రభుత్వ యంత్ర https://www.yantraindia.co.in/ అధికారిక పోర్టల్ ను, సందర్శించి దరఖాస్తును సమర్పించాలి.
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం & పూర్తి వివరాలను తనిఖీ చేయడానికి https://www.yantraindia.co.in/ అధికారిక పోర్టల్ లో సూచించబడిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే ఏ ఇతర సమాచారాన్ని ప్రామాణికరించ వద్దని నోటిఫికేషన్లో సూచించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.yantraindia.co.in/
అధికారిక ముందస్తూ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆదికారిక దరఖాస్తు స్వీకరణ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక అప్రెంటిస్షిప్ ఇండియా వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం :: 01.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరితేదీ :: 30.03.2023 రాత్రి 11:59 వరకు.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment