Wanted Teaching, Non-Teaching Staff for 2023-24 | టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Apply Online here..
![]() |
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Apply Online here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
హైదరాబాద్ బేగంపేట్ మరియు రామంతపూర్ లోని ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా సంబంధిత పోస్టులకు దరఖాస్తులను సమర్పించవచ్చు. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేపడుతున్న ఈ బోధన, బోధనేతర ఉద్యోగాలకు గూగుల్ ఫామ్ దరఖాస్తులను జనవరి 31, 2023 వరకు లేదా అంతకంటే ముందుగా సమర్పించవచ్చు. దరఖాస్తులు చేయబోయే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తులు చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ మరియు రామంతపూర్, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2023:
పోస్ట్ పేరు :: టీచింగ్, నాన్-టీచింగ్.
నిర్వహిస్తున్న సంస్థ :: ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ & రామంతపూర్, హైదరాబాద్.
పోస్టులు:
✓ టీచింగ్ విభాగంలో:
• PGT - సోషియాలజీ & పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషియాలజీ.
• TGT - మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ & మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, కెరియర్ కౌన్సిలర్, వెస్ట్రన్ మ్యూజిక్.
• PST - తెలుగు, కంప్యూటర్స్, క్లాసికల్ మ్యూజిక్ & డాన్స్, వెస్ట్రన్ మ్యూజిక్, ఆర్ట్ & క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్(మహిళా టీచర్), స్పెషల్ ఎడ్యుకేటర్.. మొదలగునవి.
✓ నాన్ టీచింగ్ విభాగంలో: జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఆఫీస్ అసిస్టెంట్ (PA to HM), ల్యాబ్ అసిస్టెంట్(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్స్) మొదలగునవి.
తప్పక చదవండి :: Teacher JOBs 2023 | టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Apply here..
విద్యార్హత:
✓ సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం.
✓ కంప్యూటర్ పరిజ్ఞానం అకౌంట్ నిర్వహణ స్కిల్ కలిగి ఉండాలి.
✓ CTET/ TET అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
31.01.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్ లో (సంబంధిత గూగుల్ ఫామ్) ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://hpsramanthapur.org/
అధికారిక టీచర్ ఉద్యోగ ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
గూగుల్ ఫామ్ ద్వారా టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Source :: https://hpsramanthapur.org/
దరఖాస్తు చివరి తేదీ :: 31.01.2023.
ఇంటర్వ్యూ షెడ్యూల్ :: షాట్ లిస్టెడ్ అభ్యర్థులకు, దరఖాస్తులో పేర్కొన్న మొబైల్ నెంబర్/ ఇమెయిల్ అడ్రస్ ద్వారా సమాచారాన్ని తెలుపుతారు. వారు సంబంధిత తేదీల్లో ఇంటర్వ్యూలు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు..
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment