AECSHYD Teaching Staff Recruitment 2023 | టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Check Eligibility, Salary, Application Process here..
![]() |
టీచర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Check Eligibility, Salary, Application Process here.. |
ఉపాధ్యాయ వృత్తి విద్యా శిక్షణను పూర్తి చేసుకొని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ శుభవార్త!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాదులోని ఆటమిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ నుండి 2023-2024 విద్యా సంవత్సరానికి గాను ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయ(TGT, PRT) పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టీచర్ ఉద్యోగాలకు 16-02-2023 నుండి 21-02-2023 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు :
TGT - ఇంగ్లీష్,
TGT - సోషల్ సైన్స్సైన్స్,
TGT - హిందీ/ సాంస్క్రిట్,
TGT - మ్యాథ్స్/ ఫిజికల్ సైన్స్,
TGT - బయో/ కెమిస్ట్రీ,
TGT - పిఈటి,
TGT - ఆర్ట్,
PRTs,
PRT - తెలుగ,
ప్రైమరీ టీచర్.. మొదలగునవి.
TGT పోస్టులకు విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి..
✓ 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో సంబంధిత సబ్జెక్టులో B.Ed, D.El.Ed, P.E ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీతో B.Ed ఉత్తీర్ణులై ఉండాలి.
✓ CTET అర్హత కలిగి ఉండాలి.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
PRT పోస్టులకు విద్యార్హత :
కనీసం 50 శాతం మార్కులతో తెలుగు ఒక సబ్జెక్టు గా ఇంటర్మీడియట్ అర్హతతో రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) అర్హత కలిగి ఉండాలి.
✓ CTET అర్హత కలిగి ఉండాలి.
Preparatory Teacher పోస్టులకు విద్యార్హత:
కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ అర్హతతో డిప్లమో ఇన్ నర్సరీ టీచర్/ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.EI.C.Ed)/ B.Ed (నర్సరీ) అర్హత కలిగి. ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగలరా నైపుణ్యం కలిగి ఉండాలి.
✓ CTET అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా నిర్వహిస్తారు.
✓ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.
వయోపరిమితి :
01-04-2023 నాటికి PRT అభ్యర్థులకు 30 సంవత్సరాలు మరియు TGT అభ్యర్థులకు 35 సంవత్సరాలకు మించకూడదు.
✓ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
గౌరవ వేతనం :
పోస్టులను అనుసరించి రూ. 21,250- నుండి రూ.26,250/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 16.02.2023 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ : 21.02.2023 సాయంత్రం 03:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://aecshyd1.edu.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ : చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
Principal Co-ordination Atomic Energy Central School-2, DAE Colony, ECIL Post, Hyderabad - 500062.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment