TSNPDCL 1600+ AE JL Vacancies Recruitment 2023 | జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
![]() |
జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here.. |
నిరుద్యోగులకు శుభవార్తశుభవార్త!
- జూనియర్ లైన్ మెన్(1553),
- అసిస్టెంట్ ఇంజనీర్(48) ఉద్యోగాలు..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSSPDCL) కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్, అసిస్టెంట్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్, జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన నియామక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1601 పోస్టులకు నియామకాలు నిర్వహించీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు 08-03-2023 నుండి 28-03-2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, దరఖాస్తు విధానం, విద్యార్హత, మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :1601
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- జూనియర్ లైన్ మెన్ - 1553,
- అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 48.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత పోస్టులను అనుసరించి 10th, ITI, Inter (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్ మ్యాన్), ఇంజనీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-01-2023 తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
గౌరవ వేతనం :
- జూనియర్ లైన్ మెన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.24,340/- నుండి రూ.39,405/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
- అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.64,295/- నుండి రూ.99,345/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- రాత పరీక్షతో పాటు ఫోల్ క్లైమింగ్ టెస్ట్ ను నిర్వహిస్తారు.
రాత పరీక్ష అంశాలు :
- జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ క్రింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- ITI (ఎలక్ట్రికల్ ట్రేడ్) లో నుండి 65 మార్కులకు 65 ప్రశ్నలు,
- జనరల్ నాలెడ్జ్ నుండి 15 మార్కులకు 15 ప్రశ్నలు.
- మొత్తం 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- సమయం 2 గంటల ఉంటుంది.
- అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు ఈ కింది అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- సెక్షన్ - 'ఏ' లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ & ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి 80 మార్కులకు 80 ప్రశ్నలు,
- సెక్షన్ - 'బి' లో జనరల్ అవేర్నెస్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ నుండి 20 మార్కులకు 20 ప్రశ్నలు.
- మొత్తం 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది.
పరీక్ష కేంద్రాల వివరాలు :
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ముఖ్య జిల్లా కేంద్రాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు, అవి;
- మహబూబ్నగర్,
- వనపర్తి,
- నాగర్ కర్నూల్,
- జోగులాంబ - గద్వాల్,
- నారాయణపేట్,
- నల్లగొండ,
- భువనగిరి - యాదగిరి,
- సూర్యాపేట్,
- మెదక్,
- సిద్దిపేట్,
- సంగారెడ్డి,
- వికారాబాద్,
- రంగారెడ్డి,
- మేడ్చల్ - మల్కాజ్గిరి,
- హైదరాబాద్.. మొదలగునవి.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులకు..
- దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.200/-
- రాత పరీక్ష ఫీజు రూ.120/-
- ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ పీహెచ్/ ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ ::
- 08-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ::
- 28-03-2023 వరకు.
అప్లికేషన్ ఎడిటింగ్ తేదీ ::
- 01-04-2023 నుండి 04-04-2023 వరకు ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ ::
- 24-04-2023 నుండి.
రాత పరీక్ష తేదీ :: 30-04-2023 న.
అధికారిక వెబ్సైట్ :: https://tsnpdcl.in/
అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) అధికారిక నోటిఫికేషన్ ::
జూనియర్ లైన్మెన్ అధికారిక నోటిఫికేషన్ ::
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment