SVNIT Non-Teaching Recruitment 2022 | SVNIT (10+2), Degree తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 118 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త!
SVNIT - బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2022, ముఖ్యాంశాలు.
◆ SVNIT - వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 188 బోధనేతర సిబ్బంది, శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. మొత్తం 12 విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
◆ ఇంటర్ డిగ్రీ బిఈ బిటెక్ ఆపై విద్యార్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు..
◆ ఆన్లైన్ దరఖాస్తులు 17.10.2022 నుండి, 02.12.2022 సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించవచ్చు..
◆ ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.9,300/- నుండి, రూ.67,000/- వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని NMDC ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. AP, TS దరఖాస్తులు చేయవచ్చు..
SVNIT - బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు - 2022; భారత ప్రభుత్వం విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, సూరత్ లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 188 శాశ్వత ఉద్యోగాల భర్తీకి, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ.. భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, రాత పరీక్షలు నెగ్గి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. SVNIT డైరెక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడుతున్నది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్యమైన సమాచారం దిగువన.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 118.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. లైబ్రరీయన్ - 01,
2. సైంటిఫిక్ ఆఫీసర్/ టెక్నికల్ ఆఫీసర్(MIS) - 01,
3. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్/ ఎలక్ట్రికల్) - 02,
4. సూపరిటెన్డెంట్ - 06,
5. జూనియర్ ఇంజనీర్(సివిల్ ఇంజనీర్/ ఎలక్ట్రికల్ ఇంజనీర్) - 05,
6. టెక్నికల్ అసిస్టెంట్ - 17,
7. ఫార్మసిస్ట్ - 01,
8. జూనియర్ అసిస్టెంట్ - 15,
తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
9. సీనియర్ అసిస్టెంట్ - 08,
10. ఆఫీస్ అటెండెంట్ - 17,
11. సీనియర్ టెక్నీషియన్ - 13,
12. టెక్నీషియన్ - 25.. మొదలగునవి.
విద్యార్హత:
విభాగాల వారీగా ఉన్న పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, ఇంటర్మీడియట్(10+2)/ సంబంధిత విభాగంలో(బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ డిప్లమో/ బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ)/ విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 27 నుండి 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయోపరిమితి గల రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు, అధికారికి నోటిఫికేషన్ తప్పక చదవండి.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
ఎంపిక విధానం:
పాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.9,300/- నుండి, రూ.67,000/- వేల వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మాజీ సైనికులకు/ మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 17.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ తో పాటు సంబంధిత ధ్రువపత్రాల కాపీలను జత చేసి హార్డ్ కాపీ ను పంపడానికి చివరి తేదీ:: 12.12.2022.
తప్పక చదవండి :: డిగ్రీతో 50 శాశ్వత జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
అధికారిక వెబ్సైట్ :: https://www.svnit.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.svnit.ac.in/
◆ అధికారిక Home పేజీలోనే Side Menu Bar లో కనిపిస్తున్న Career లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు Recruitment పేజ్ లోకి రీ డైరెక్టు అవుతారు. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఎదురుగా View Page లింక్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
◆ ఇక్కడ విభాగలవారీగా ఖాళీల వివరాలతో, Online Apply లింక్ అనిపిస్తుంది. వాటిపై క్లిక్ చేసి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ అభ్యర్థులు ముందుగా వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగిన్ అయి, దరఖాస్తులను సమర్పించాలి.
◆ ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి ఇక్కడ కనిపిస్తున్న Apply లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి విజయవంతంగా దరఖాస్తులను సమర్పించండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
డైరెక్ట్ గా ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment