UCIL Trade Apprentices Recruitment 2022 | UCIL inviting Online Applications for 30 ITI Treade Apprentices Training Vacancies | Check Eligibility, Application process and more details here..
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ITI ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు, ఈ శిక్షణలను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 16న ప్రారంభమై, డిసెంబర్ 7న ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం సోపానాలు ఇక్కడ.
తప్పక చదవండి :: 10 తో ఉద్యోగాల భర్తీకి ITBPF నుండి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు విధానం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 30.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ ఫీట్టర్ - 08,
◆ ఎలక్ట్రీషియన్ - 08,
◆ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్) - 04,
◆ టర్నర్/ మెకానిస్ట్ - 03,
◆ మెకానిక్ డీజిల్ - 03,
◆ కార్పెంటర్ - 02,
◆ ప్లంబర్ - 02.. మొదలగునవి.
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, 10వ తరగతి విద్యార్హతతో సంబంధిత విభాగంలో ITI అర్హత నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్(NCVT) నుండి కలిగి ఉండాలి.
వయో పరిమితి:
07.12.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబిసీలకు 3 సంవత్సరాలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు దరఖాస్తులు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.
ఎంపిక విధానం:
అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా.. వచ్చిన దరఖాస్తులను, షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో.. ఒక సంవత్సరం పాటు ప్రతినెల రూ.7,000/- నుండి, రూ.9,000/- స్కాలర్షిప్ రూపంలో జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: DRDO CEPTAM Recruitment 2022 | ప్రభుత్వ పర్మినెంట్ 1061 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. వివరాలివే..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.12.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/ & https://uraniumcorp.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి అధికారిక అప్రెంటిషిప్ ఇండియా పోర్టల్ సందర్శించాలి.
◆ అధికారిక వెబ్సైట్ :: https://www.apprenticeshipindia.gov.in/
◆ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు ఇక్కడ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని ఉండాలి.
◆ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, Home పేజీలోనే Login బటన్ పై క్లిక్ చేసి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించవచ్చు.
◆ ఇక్కడ అకౌంట్ కలిగి లేని అభ్యర్థులు, Home పేజీలోని Register బటన్ పై క్లిక్ చేసి, Candidate బటన్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేసే, రిజిస్ట్రేషన్ విజయవంతం చేయవచ్చు..
◆ తదుపరి Login బటన్ పై క్లిక్ చేసే లాగిన్ దరఖాస్తులను సమర్పించండి.







°★ రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేయాల్సిన ధ్రువపత్రాల కాపీల వివరాలు:
◆ 10వ తరగతి మార్క్ షీట్,
◆ ITI మార్క్ షీట్,
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(నాన్ క్రిమిలైయర్) అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం,
◆ EWS అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్,
◆ దివ్యాంగులైతే సంబంధిత మెడికల్ సర్టిఫికెట్/ సదరం సర్టిఫికెట్,
◆ ఫోటో & సిగ్నేచర్,
◆ ఆధార్ కార్డ్ & పాన్ కార్డ్,
◆ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్,
◆ ఈమెయిల్ ఐడి.. నమోదు చేయాలి.
డైరెక్ట్ గా ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment