డిగ్రీ తో 336 ఆఫీసర్ కొలువులు.. ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సిలబస్ అంశాలు మొదలగునవి. AFCAT 01/2025 NCC Special Entry Recruitment Apply here..
336 ఆఫీసర్ కొలువులు.. ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం, సిలబస్ అంశాలు:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AFCAT) - 01/2025) కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత డిసెంబర్ 31, 2024 నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించవచ్చు. మహిళ/ పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల్లో మొత్తం 336 ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ అయినది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 336.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
AFCAT Entry లో..
- ఫ్లయింగ్ - 30,
- గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ - 189,
- గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ - 115,
NCC Special Entry లో..
- ఫ్లయింగ్ లో CDSE & AFCAT నుండి 10%.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఏదైనా డిగ్రీ / NCC ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సి-సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.01.2026 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు.
📌 అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులకు అవివాహితులు మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం:
- పైన పేర్కొనబడిన పోస్టులకు ఎంపికలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
- ముందుగా ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహణ.
- అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ ఎయిర్ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాత పరీక్ష అంశాలు/ సిలబస్:
- మొదటి దశ పరీక్ష మొత్తం 300 మార్కులకు(100 ప్రశ్నలు) నిర్వహిస్తారు.
ఇందులో 4 దశలలో ప్రశ్నలు అడుగుతారు,అవి;
- జనరల్ అవేర్నెస్,
- ఇంగ్లీష్ వెర్బ్ల్ ఎబిలిటీ,
- న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్,
- మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు.
- రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో ఉంటుంది.
- పరీక్ష సమయం 2 గంటలు.
గౌరవ వేతనం :
- ఫ్లయింగ్ ఆఫీసర్ ఎంపికైన అభ్యర్థులకు రక్షణ మంత్రిత్వ శాఖ పే స్కేల్ (లెవల్ -10) రూ.56,100/- నుండి రూ.1,77,500/- ప్రకారం + 15,500/- కలిపి ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
📌 శిక్షణ కాలంలో రూ.56,100/- వేతనంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గుంటూరు, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- AFCAT పోస్టులకు రూ.550/-.
- NCC Special Entry పోస్టులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.12.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.12.2024 రాత్రి 11:30 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://afcat.cdac.in/AFCAT/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment