ANGARU Teaching, Non-Teaching Part-Time Faculty Recruitment 2022 | Check Eligibility, Salary, Selection process and more details here..
నిరుద్యోగులకు శుభవార్త!
ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, 2022-23 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధ నేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఈనెల 18 నుండి 22 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్స్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం..
తప్పక చదవండి :: టీచింగ్ & నాన్-టీచింగ్ విభాగాల్లో 632 ఉద్యోగాల భక్తికి భారీ ప్రకటన! పూర్తి వివరాలివే..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 08.
విభాగాల వారీగా ఖాళీల సంఖ్య:
◆ పార్ట్ టైం టీచర్ - 03,
◆ టీచింగ్ అసోసియేట్ - 01,
◆ ఫిజికల్ డైరెక్టర్ - 01,
◆ టెక్నికల్ అసిస్టెంట్ - 02,
◆ రీసెర్చ్ అసోసియేట్ - 01.. మొదలగునవి.
తప్పక చదవండి :: KVS - Teaching, Non-Teaching Staff Recruitment 2022 | కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
◆ పార్ట్ టైం టీచర్ పోస్టులకు:
అగ్రికల్చర్ ఇంజనీరింగ్(ఎంటెక్/ ఎమ్మెస్సీ/ ఎంఫిల్/ పిహెచ్డి..
◆ టీచింగ్ అసోసియేట్ పోస్టులకు:
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో (బీటెక్/ ఎంటెక్)..
◆ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు:
ఎంపీఎడ్/ పీహెచ్డీ..
◆ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు:
అగ్రికల్చర్/ మైక్రో బయాలజీ/ బయోటెక్నాలజీ/ ఏదైనా విభాగంలో (సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న) బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి..
◆ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు:
ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్ స్పెషలైజేషన్ విభాగంలో హోమ్ సైన్స్ మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి..
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి దరఖాస్తు తేదీ నాటికి 35-45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 18 నుండి 22 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు చేస్తారు.
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
పోస్టుల వారీగా ఇంటర్వ్యూ తేదీలు :
◆ ఫిజికల్ డైరెక్టర్లకు 18.11.2022 న ఉదయం 11:00 గంటల నుండి,
◆ టెక్నికల్ అసిస్టెంట్లకు, & రీసెర్చ్ అసోసియేట్లకు 21.11.2022 న ఉదయం 11:00 గంటల నుండి
◆ పార్ట్-టైం టీచర్ టీచింగ్ అసోసియేట్లకు 22.11.2022 ఉదయం 10:00 నుండి..
ఇంటర్వ్యూ వేదిక:
ఆచార్య ఎన్.జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్.







గౌరవ వేతనం:
పోస్టులను బట్టి రూ.15,000/- నుండి రూ.54,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అధికారిక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://angrau.ac.in/
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment