TS DMHO Recruitment 2022 | తెలంగాణ: బస్తి దావఖానాల్లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ప్రకటన!. వివరాలతో దరఖాస్తులు లింక్ ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ: వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.
తెలంగాణ-హైదరాబాద్, మల్టీజోన్ -II పరిధిలోని 14 జిల్లాల్లో ఖాళీగా ఉన్న బస్తి దావఖానాల్లో మెడికల్ ఆఫీసర్(ఫుల్ టైం) & మెడికల్ ఆఫీసర్(బస్తీ దావఖాన) పోస్టుల నియామకానికి ఆన్లైన్ గూగుల్ ఫామ్ https://forms.gle/s1UTWc3M5RqZw1rQ6 ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ-హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ విడుదలైనది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా నవంబర్ 07, 2022 నుండి నవంబర్ 11, 2022 మధ్య దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు నియామకాలు కాంట్రాక్ట్ ప్రాథపాదికన భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారమైన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 31.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ మెడికల్ ఆఫీసర్ (ఫుల్ టైం) - 05,
◆ మెడికల్ ఆఫీసర్ (బస్తి దావఖాన) - 26.
తప్పక చదవండి :: తెలంగాణ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!.. 7వ/ 10వ/ ఇంటర్/ డిగ్రీ అభ్యర్థులు దరఖాస్తు చేయండిలా.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS అర్హతతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి.
వయోపరిమితి:
● జూన్ 30 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
● అధికమయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు ఆ వివరాలు;
● ఎస్సీ/ ఎస్టీ & ఓబీసీ లకు - 5 సంవత్సరాలు,
● మాజీ సైనికులకు - 3 సంవత్సరాలు,
● దివ్యాంగులకు - 10 సంవత్సరాలు.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
మల్టీ జోన్-II పరిధిలోని జిల్లాలు:
1. సూర్యపేట,
2. నలగొండ,
3. భువనగిరి (యాదాద్రి),,
4. జనగాం,
5. మేడ్చల్ (మల్కాజ్గిరి),
6. హైదరాబాద్,
7. రంగారెడ్డి,
తప్పక చదవండి :: కేంద్రీయ విద్యాలయ సంస్థ 4,014 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!.. వివరాలివే.
8. సంగారెడ్డి,
9. వికారాబాద్
10. మహబూబ్నగర్
11. జోగులాంబ (గద్వాల్),
12. వనపర్తి,
13. నాగర్ కర్నూల్ ,
14. నారాయణపేట.. మొదలగునవి.
ఎంపిక విధానం:
అకాడమిక్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ, అనుభవం ఆధారంగా వెయిటేజి మార్పులతో.., వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు స్కేల్ ఆఫ్ పే రూ.52,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి :: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 11.11.2022.
ఆదికారిక వెబ్సైట్ :: https://hyderabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక రిక్రూట్మెంట్ గైడ్లైన్స్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన గూగుల్ ఫామ్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
నిరాకరణ : మేము eLearningBADI.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment