తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం Study Circle Free Coaching Hurry Up! Registration Closed Soon..
తెలంగాణ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, ఉచిత సివిల్ సర్వీసెస్ పరీక్షలు - 2025 కోసం శిక్షణ అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం..
ఉద్యోగార్థులకు శుభవార్త!
డిగ్రీ అర్హతతో అత్యున్నత స్థాయి/ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది. స్టడీ సర్కిల్ ద్వారా UPSC Civil Services Examination 2025 కోసం ఉచిత శిక్షణ లను అందించడానికి నిరుద్యోగ ఎస్సీ/ ఎస్టీ/ బీసీ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ST, SC & BC అభ్యర్థులు 9 నెలల/ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించే నాటి వరకు ఉచిత సివిల్ సర్వీస్ శిక్షణ ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు:
- ఏపీ/ ఎస్సీ/ మరియు బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 01.08.2024 నాటికి 18 సంవత్సరాల నుండి పైబడి ఉండాలి. SC & ST లకు - 37 సంవత్సరాలు, BC లకు - 35 సంవత్సరాలు, PHC లకు - 42 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- దరఖాస్తుదారు తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3,00,000/- మించకూడదు.
- ఇప్పటికే ఉచిత శిక్షణ ను తీసుకొని ఉన్న వారు మరలా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
- అభ్యర్థులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.
రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు :
- ST లకు - 75,
- SC లకు - 15,
- BC లకు - 10
- మొత్తం - 100.
ఎంపిక విధానం :
- స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.
- డిగ్రీ స్థాయి నుండి పర్సనల్ అడుగుతారు.
- మొత్తం 100 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది.
- ప్రతి ప్రశ్నకు ఒక (1) మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ (0.25 ) కొత విధిస్తారు.
శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఈ క్రింది ఫెసిలిటీస్ కూడా అందిస్తారు..
- ఉచిత భోజనం మరియు వసతి,
- బుక్ ఫండ్ కోసం రూ.8,000/-,
- మెయిన్స్ ప్రిపరేషన్ కోసం బుక్ ఫండ్ రూ.4,000/-,
- ప్రిపరేషన్ కోసం లైబ్రరీ, మ్యాగజైన్ ప్రముఖ న్యూస్ పేపర్లు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి..
- ప్రతి నెల రూ.1,000/- పురుషులకు, రూ.1,250/- మహిళలకు శిక్షణ కాలంలో పాకెట్ మనీ క్రింద చెల్లిస్తారు.
- లాంగ్ నోట్ బుక్ లు - 20 అందిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు లో భాగంగా ఈ క్రింది అర్హత పత్రాల కాపీలను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఇటీవల ఫోటో,
- సిగ్నేచర్,
- 10వ తరగతి మెమో,
- ఇంటర్ మెమో,
- డిగ్రీ మెమో,
- పీజీ మేమో,
- కుల దృవీకరణ పత్రం,
- ఆదాయ ధ్రువీకరణ పత్రం,
- నేటివిటీ సర్టిఫికెట్,
- ఆధార్ కాఫీ,
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మొదలగునవి ఆన్లైన్లో దరఖాస్తులో భాగంగా అప్లోడ్ చేయాలి.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల :: 13.06.2024.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 13.06.2024.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ : 30.06.2024.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment