బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025: ట్రిపుల్ ఐటీ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్స్ దరఖాస్తు విధానం.
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులో విద్యా సంవత్సరం 2025-26 కు గాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ 28.05.2025 న విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 31.05.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 21.06.2025. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
మొత్తం సీట్ల వివరాలు :: 1680.
- బాసర క్యాంపస్ -1500,
- మహబూబ్నగర్ క్యాంపస్ -180.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఐటీ విద్య అందించే బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యాలయం దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయాల పరిధిలోని ఆర్ జీ యు కే టీ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు కు సంబంధించి ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు కాఫీతో మిగతా ఇతర ధ్రువపత్రాల కాపీలను జూన్ 26వ తేదీ లోపు విద్యాలయానికి పంపించాలి. జూలై 4వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూలై 7న మొదటి విడత కౌన్సిలింగ్, తదుపరి తరగతులు ప్రారంభమవుతాయి.
ప్రవేశ అర్హతలు :
- విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి/ ఏప్రిల్ -2025 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- ప్రవేశం నాటికి 18 సంవత్సరాలకు మించకూడదు.
- ఎస్సీ/ ఎస్టీ వర్గాల విద్యార్థుల వయస్సు 21 సంవత్సరాలకు మించకూడదు.
రిజర్వేషన్ల వారీగా సీట్ల శాతం :
- ఎస్సీలకు 15%,
- ఎస్టీ లకు 8%,
- బీసీ - ఏ లకు 7-10%,
- బీసీ - సీ లకు 1%,
- బీసీ - డీ లకు 7%,
- బీసీ - ఈ లకు 4%,
- దివ్యాంగులకు 3%,
- సైనిక ఉద్యోగుల పిల్లలకు 2%,
- ఎన్ సీ సీ విద్యార్థులకు 1%,
- స్పోర్ట్స్ కోటా క్రింద 0.5% సీట్లు భర్తీ చేస్తారు.
- 80% సీట్లు తెలంగాణ,
- 15% ఆంధ్ర-తెలంగాణ విద్యార్థులతో అండ్ రిజర్వ్డ్ సీట్ల భర్తీ.
- ఎన్ ఆర్ ఐ, గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల సంతతి విద్యార్థులకు 5% సీట్లు.
ఎంపిక విధానం :
- విద్యా సంవత్సరం 2024-25 లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి/ ఏప్రిల్ 2025 (SSC/ CSBE) కనబరిచిన ప్రతిభ మార్కుల జాబితా ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
- రిజర్వేషన్లను పాటిస్తూ ఎంపికలు చేస్తారు.
📌 సూచన :: మెరిట్ జాబితాలో సీటు పొంది కౌన్సిలింగ్ కు హాజరుకాని విద్యార్థులకు వారి స్థానంలో తదుపరి మెరిట్ విద్యార్థికి అవకాశం కల్పిస్తారు.
ఈ ఆరు సంవత్సరాలు గట్టిగా కష్టపడితే కొలువు దక్కుతుంది.
- ఆర్జీయూకేటిలో మొదటి బ్యాచ్ విద్యార్థులు 2014 లో కోర్స్ పూర్తి చేశారు. అప్పటినుండే ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలు విద్యాలయంలో ప్రాంగణ నియామకాలు చేపట్టడం ప్రారంభించాయి.
- 40% విద్యార్థులు ప్రతి సంవత్సరం ప్రాంగణ నియామకాల్లో కొలువు దక్కించుకుంటున్నారు.
- అలాగే గేట్ తదితర ప్రవేశ పరీక్షల్లో ర్యాంకులను సాధిస్తూ ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు.
- మల్టీ నేషనల్ కంపెనీలో లక్షల్లో ప్యాకేజీ తో స్థిరపడ్డారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఓసి బిసి విద్యార్థులకు రూ.500/-,
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400/-
- అధికారిక వెబ్సైట్ :: https://www.rgukt.ac.in/
- అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
- ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.05.2025,
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 21.06.2025.
- ఆన్లైన్ దరఖాస్తు తో పాటు ఇతర అర్హత ధ్రువపత్రాల కాపీలతో దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ :: 25.06.2025.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా:
The Convener
UG Admissions 2025-26
Rajiv Gandhi University of Knowledge Technologies–Basar Basar, Nirmal District
Telangana State-504107. స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి.
- ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల తేదీ :: 04.07.2025.
- మొదటి విడత కౌన్సెలింగ్ :: 07.07.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment