SBI Alert || Dear SBI Customer account has been blocked due to KYC update || Get individual KYC update details here...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలర్ట్.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లను అలర్ట్ చేస్తుంది. ఎస్బిఐ అకౌంట్ నుండి కేవైసీ చెయ్యకపోతే వెంటనే చేసుకోవాలని, అలా చేసుకోని పక్షంలో ఖాతా లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉందని 'హెచ్చరిక' మెసేజ్లను పంపిస్తుంది. ఇప్పటివరకు కేవైసీ అప్డేట్ చేసుకోని వారికి చానా సార్లు అలర్ట్ మెసేజ్లను చేస్తూ వచ్చింది.
వ్యక్తిగత వివరాల ఆధారంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం..
క్రింది వీడియొను చూసి సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోండీ.. మీ సలహాలను సంధెహాలను కామెంట్ చేయండి.
31 మే 2021 లోగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లందరూ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే ఈ మధ్యకాలంలో కస్టమర్లకు సైబర్ నేరగాళ్లు రకరకాల మెసేజ్లను సోషల్ మీడియా ద్వారా పంపిస్తున్నారు. 24 గంటల లోగా కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నట్లు సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతున్నాయి. వినియోగదారులు అలాంటి మెసేజ్లను నమ్మవద్దని ఎస్బిఐ హెచ్చరిస్తుంది. సైబర్ నేరగాళ్లు అక్కడితో ఆగకుండా మెసేజ్ చివరలో నెంబర్ను కూడా పంపిస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మీరు నేరుగా నేరగాళ్ల ఉచ్చులో పడినట్లే అని, అలాంటి మెసేజ్లను నమ్మవద్దని ఎస్బిఐ హెచ్చరిస్తుంది.
" ప్రియమైన కస్టమర్, మీ అప్రమత్తతను మేము అభినందిస్తున్నాము మోసపూరిత SMS/ eMail ల గురించి జాగ్రత్త వహించండి. ఎస్బిఐ తమ వినియోగదారుల నుండి యూజర్ ఐడి / పాస్వర్డ్ / డెబిట్ కార్డ్ నెంబర్ / పిన్/ సివివి మొదలైనవి ఎప్పుడూ అడగదు." యూజర్ ఐడి/ పాస్వర్డ్/ డెబిట్ కార్డ్ వివరాల వంటివి నవీకరించడానికి లేదా ధృవీకరించడానికి అడుగుతున్న ఇమెయిల్ లు/ ఎంబెడెడ్ లింక్ లు/ మొదలైన వివరాలను అడిగి ఫోన్ కాల్స్ ను ఎప్పుడు స్పందించ వద్దు. ఇదేవిధంగా మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి/ పాస్వర్డ్ మార్చుకోవాలని, సంబంధిత వివరాలను అడిగితే ఎట్టి పరిస్థితుల్లో వాటిని తెలియ పరచ వద్దు అని హెచ్చరిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీ అప్డేట్ చేసుకొని వారు మే 31 లోపు అప్డేట్ చేసుకోవాలని, కేవైసీ అప్డేట్ ఉన్నవారి అకౌంట్ లావాదేవీలు సక్రమంగా కొనసాగుతాయని, చేసుకొని వారు వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకుని తమ అకౌంట్ లావాదేవీలను కొనసాగించాలని.. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉందని సూచించింది.
ఎస్బిఐ వినియోగదారులు కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి తమ 'హోమ్ బ్రాంచ్ లను సందర్శించి' మాత్రమే కాకుండా దగ్గరలోని ఎస్బిఐ బ్రాంచ్ లో కూడా కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకులకు వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకోవడం కష్టతరమవుతుంది. కస్టమర్లు సంబంధిత హోమ్ బ్రాంచ్ ఈ మెయిల్ కు డాక్యుమెంట్స్ ను బ్యాంకుకు పంపించే కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. కేవైసీ అప్డేట్ అయినటు వంటి సమాచారం రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. నేరుగా ఎస్బిఐ బ్రాంచ్ ను సందర్శించకుండా కూడా ఈ మెయిల్ కు సంబంధిత డాక్యుమెంట్లను పంపించడం ద్వారా కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చని ఎస్బిఐ ప్రకటించింది.
మీ హోమ్ బ్యాంక్ బ్రాంచ్ ఈ యొక్క ఈ మెయిల్ మరియు పోస్టల్ చిరునామాను ఇక్కడ తెలుసుకోండి.
పై లింక్ పై క్లిక్ చేయగానే మేరు సంభందిత పేజ్ లోకి రెడైరెక్ట్ అవుతారు. సంభందిత వివరాలను ఎంటర్ చేసి మే హోం బ్రాంచ్ యొక్క ఈమేల్ అడ్రెస్ ను/ పోస్టల్ అడ్రెస్ ను తెలుసుకోండి.
ఎస్బిఐ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి ఈ క్రింది పత్రాలు అంగీకరించ పడతాయి.
1. పాస్పోర్ట్
2. ఓటర్ గుర్తింపు కార్డు
3. డ్రైవింగ్ లైసెన్స్
4. ఆధార్ కార్డు
5. పాన్ కార్డు.
అధికారిక వెబ్సైట్: https://sbi.co.in/
Comments
Post a Comment