TS Staff Nurse Recruitment 2022 | GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..
![]() |
GNM & BSc(Nursing) తో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ |
నిరుద్యోగులకు శుభవార్త!
GNM & BSc(Nursing) తో శాశ్వత స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిరుద్యోగ యువతకు.. మెడికల్ & హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(MHSRB) భారీ శుభవార్త చెప్పింది.. నూతన సంవత్సర కానుకగా 5,204 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:30/2022 తేదీ:30/12/2022 జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 25.01.2023 నుండి 15/02/2023 వరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇప్పటికే ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న సర్వీస్కు వెయిటేజీ మార్కులను కేటాయిస్తూ నియామకాలను నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.36,750 నుండి రూ.1,06,990 ప్రకారం జీతాలను ఇవ్వనుంది రిజర్వేషన్ల అమలు లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 5,204.
ఉద్యోగం పేరు :: స్టాఫ్ నర్స్.
నిర్వహిస్తున్న సంస్థ :: తెలంగాణ & మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB)
విభాగాల వారీగా ఖాళీలు:
1. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్/ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో - 3,823,
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో - 751,
3. MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకలజీ రీజనల్ క్యాన్సర్ సెంటర్ (MNJIO & RCC) లోలో - 81,
4. డిపార్ట్మెంట్ ఫర్ డిజేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ లో - 8,
5. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లో - 127,
6. మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీసొసైటీ లో - 197,
7. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (గురుకులం) లో - 74,
8. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీసొసైటీ లో - 124,
9. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ లో - 13.. ఇలా మొత్తం 5,204 పోస్టులను భర్తీ ప్రకటించింది.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ(GNM) లేదా బిఎస్సి (నర్సింగ్) అర్హత కలిగి తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
✓ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
✓ పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
✓ అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్నది.
తాజా ఉద్యోగాలు!
ఎంపిక విధానం:
✓ ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికలు 100 మార్కుల వెయిటేజ్ ప్రాతిపదికన ఉంటుంది.
• రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ,
• వివిధ గవర్నమెంట్ హాస్పిటల్/ ఇన్స్టిట్యూషన్స్ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న వారికి సర్వీస్ ఆధారంగా 20 శాతం వెయిటేజీ,
• గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
✓ రాత పరీక్ష ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.
✓ మొత్తం 80 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు.
రాతపరీక్ష సిలబస్లో పరిగణలోకి తీసుకునే అంశాలు:
1. అనాటమీ,
2. మైక్రో బయాలజీ,
3. ఫిజియాలజీ,
4. సోషియాలజీ,
5. ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్,
6. ఫస్ట్ ఎయిడ్,
7. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్-1,
8. ఎన్విరాన్మెంటల్ హైజీన్,
9. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్,
10. న్యూట్రీషియన్,
11. మెడికల్ సర్జికల్ నర్సింగ్-1,
12. మెడికల్ సర్జికల్ నర్సింగ్-2,
13. మెంటల్ హెల్త్ నర్సింగ్,
14. చైల్డ్ హెల్త్ నర్సింగ్నర్సింగ్,
15. మిడ్ వైఫరీ అండ్ గైనకాలజీకల్ నర్సింగ్,
16. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్-2,
17. నర్సింగ్ ఎడ్యుకేషన్,
18. ఇంట్రడక్షన్ టు రీసెర్చ్,
19. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్,
20. నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్.. మొదలగునవి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
✓ పరీక్ష ఫీజు రూ.500/-.
✓ దరఖాస్తు ఫీజు రూ.200/-.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.01.2024 ఉదయం 10:30 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 15.02.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment