BSF JOBs 2022 | ఇంటర్మీడియట్ తో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ తో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) 312 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాలకు మహిళా, పురుష అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; మొత్తం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, రాత పరీక్ష, సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 323.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) - 11
◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) - 312.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి.
◆ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హతతో నిమిషానికి 80 పదాలు ఇంగ్లీషులో అలాగే పది నిమిషాలకు 80 పదాలను హిందీ లో టైపు చెయ్యగల సామర్థ్యం కలిగి ఉండాలి.
◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాలకు నిమిషానికి 35 పదాలను ఇంగ్లీషులో అలాగే హిందీలో 30 పదాలను టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. పూర్తి వివరణాత్మక సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు ఒకసారి చదవండి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్.. పరీక్షల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
◆ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (స్టేనియోగ్రాఫర్) ఉద్యోగాలకు ఎంపికైన వారికి Pay Level 5 ప్రకారం ₹.29,200/- నుండి ₹.92,300/- అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఉద్యోగాలకు ఎంపికైన వారికి Pay Level 4 ప్రకారం ₹.25,500/- నుండి ₹.81,100/- అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.47.2/-
రిజర్వేషన్ వర్గాల వారికి ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.09.2022







అధికారిక వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment