LIC AAO Recruitment 2023 | డిగ్రీతో 300 ఉద్యోగాల భర్తీకి LIC భారీ ప్రకటన | Check Full Details and Apply Online here..
![]() |
డిగ్రీతో 300 ఉద్యోగాల భర్తీకి LIC భారీ ప్రకటన |
నిరుద్యోగులకు శుభవార్త!
గ్రాడ్యుయేషన్ అర్హతతో భారత ప్రభుత్వ దిగ్గజా ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభవార్త! 53,600/- బేసిక్ పే తో, రాత పరీక్ష ఆధారంగా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జర్నలిస్ట్) 31st బ్యాచ్ నియామకాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-ముంబై, భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు అన్న సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 15.01.2023 నుండి, 31.01.2023 మధ్య సమర్పించవచ్చు. ఈ నియామకాలు వేగవంతంగా నిర్వహించడానికి తగు తేదీలను ముందుగానే ప్రకటించింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లేదా క్రింద ఉన్న లింక్ ఆధారంగా నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలను తనిఖీ చెయ్యండి.. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం ఇక్కడ.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 300.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: LIC ADO Recruitment 2023 | డిగ్రీ తో 9,394 ADO ఉద్యోగాల భర్తీ | Apply Online here..
వయోపరిమితి:
✓ 01.01.2023 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు లను వర్తింప చేస్తూ అధికారిక నోటిఫికేషన్లో వివరణను సూచించారు.
పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ చదవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంపిక విధానం:
✓ రాత పరీక్ష/ మెడికల్ పరీక్ష ల ఆధారంగా ఉంటాయి.
✓ రాత పరీక్ష Phase -1, Phase -2, రూపంలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
✓ ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.53,600 నుండి రూ.1,02,090 వరకు అన్నీ అలవెన్స్ లతో కలిపి ప్రతినెల జీతంగా చెల్లిస్తారు.
✓ ఉద్యోగంలో చేరగానే రూ.92,870/- జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
✓ జనరల్ అభ్యర్థులకు రూ.700/-,
✓ రిజర్వేషన్ వర్గాలవారికి రూ.85/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.01.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.01.2023.
ఆన్లైన్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల : ప్రాథమిక పరీక్ష నిర్వహించడానికి 7 నుండి 10 రోజుల ముందు.. గా
ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష తాత్కాలిక తేది :: 17.02.2023 & 20.02.2023.
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష తాత్కాలిక తేదీ :: 18.03.2022.
అధికారిక వెబ్సైట్ :: https://licindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment