Bank JOBs 2022 | డిగ్రీతో 50 శాశ్వత జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
నిరుద్యోగులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రంగానికి చెందిన చెన్నయి లోని రెప్కో బ్యాంక్ వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడానికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత 05.11.2022 నుండి 25.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు, ఎంపికైన అభ్యర్థులకు 17,900 నుండి, 47,900 వరకు ప్రతినెల జీతం గా చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం దిగువన..
తప్పక చదవండి :: OSSC - కంబైన్డ్ టెక్నికల్ సర్వీస్ పరీక్ష-2022. 1,225 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 50.
పోస్ట్ పేరు :: జూనియర్ అసిస్టెంట్/ క్లర్క్.
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఆంధ్రప్రదేశ్ - 04,
2. కేరళ - 02,
3. కర్ణాటక - 04,
4. తమిళనాడు & పోదుచ్చేరి - 40.. మొదలగునవి
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.
◆ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.
వయో పరిమితి:
◆ 30.09.2022 నాటికి 21 నుండి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు తప్పక చదవండి.
ఎంపిక విధానం:
◆ ఆన్లైన్ రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
◆ ఆన్లైన్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
◆ ఈ పరీక్ష ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.
◆ రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు,
◆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు,
◆ క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు,
◆ జనరల్ అవేర్నెస్ (విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ) నుండి 40 ప్రశ్నలు,
◆ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 ప్రశ్నలు.. అడుగుతారు.
◆ పరీక్ష సమయం 120 నిమిషాలు.
తప్పక చదవండి :: NTPC 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు చేయండి ఇలా.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు రూ.17,900/- నుండి, రూ.47,900/- వరకు ప్రతినెల జీతం గా చెల్లించనుంది.
ఆన్లైన్ రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
◆ చెన్నై, కోయంబత్తూర్, మధురై, తిరుచి, సేలం, తిరునెల వెళ్లి, త్రివేండ్రం, విజయవాడ, వైజాగ్, బెంగళూరు.. మొదలగునవి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.900/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మాజీ సైనికులకు రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.repcobank.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.11.2022.
తప్పక చదవండి :: AP: Bank Job's 2022 | శాశ్వత ప్రాతిపదికన సహకార బ్యాంకులలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://www.repcobank.com/
◆ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి Home పేజీ లోని Careers లింకు పై క్లిక్ చేసి, తదుపరి Online Apply లింకు పై క్లిక్ చేసి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
◆ తదుపరి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి..
◆ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ.., అవసరమైన చోట అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేస్తూ.. ఫోటో, సిగ్నేచర్ లను అప్లోడ్ చేసి, దరఖాస్తు ఫీజు సమర్పించి.. విజయవంతంగా దరఖాస్తులు చేయండి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment