WDSC Telangana Recruitment 2022 | WDSC Inviting Applications for Coordinator and Data Entry Operator | Check eligibility and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
ఎంపికైన అభ్యర్థులకు రూ.26,749/- నుండి, రూ.50,000/- వరకు జీతం.
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో కంప్యూటర్ అప్లికేషన్ డాటా ఎంట్రీ ఆపరేటర్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు..
తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ.
తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఉద్యోగ నియామకాలు-2022:
తెలంగాణ ప్రభుత్వము, వికలాంగుల & వయవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకుల వారి కార్యాలయం హైదరాబాద్, హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్.. ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నవంబర్ 15, 2022న నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.. ఇప్పటికే కోఆర్డినేటర్లుగా సేవలందిస్తున్న వారికి రెండు సంవత్సరాలకు మించి అనుభవం ఉంటే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. లేదా ఈ పేజ్ దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 02.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ కోఆర్డినేటర్ - 01,
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01..
తప్పక చదవండి :: ప్రభుత్వ పర్మినెంట్ 419 ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాస్ సెంటర్ భారీ నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
◆ కోఆర్డినేటర్ పోస్టులకు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ (హ్యుమానిటీస్/ సోషల్ సైన్సెస్/ సోషియాలజీ/ సైకాలజీ/ సోషల్ వర్క విభాగాల్లో B.A అర్హత).
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో కంప్యూటర్ అప్లికేషన్స్/ డాటా ఎంట్రీ ఆపరేటర్ ప్రామాణిక సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 21-45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను, అక్కడ మీకు విద్యార్హతల్లో కనపరిచిన ప్రతిభ/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు దిగువ పేర్కొన్న వేతనాలను చెల్లించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
◆ కోఆర్డినేటర్లకు - రూ.50,000/-,
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు - రూ.26,749/-..







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.11.2022 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://wdsc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
Office of the Director, Welfare of Disabled & Senior Citizens dept., Malakpet, Nalagonda X Roads, Hyderabad.
ఇతర వివరాలకు మరియు సందేహాల నివృత్తి కోసం ఈ 040-24559048 నెంబర్కు సంప్రదించగలరు.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment