TS DHMO MO Recruitment 2023 | జిల్లా ఆరోగ్య శాఖ లో మెడికల్ సిబ్బంది ఉద్యోగాలు | Download Application here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం నిర్మల్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే, ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ఆరోగ్య శాఖ ఆసుపత్రులలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. టీ పోస్టులను కాంట్రాక్ట్/ తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 15 . పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్ . విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, BAMS అర్హత ను కలిగి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల