AP TW GURUKULAM Admission Notification 2021 || ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తాడేపల్లి (గురుకులం) నుండి ప్రవేశ ప్రకటన విడుదల.. పూర్తి వివరాలు ఇవే...
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2021-22 విద్యా సంవత్సరమునకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో లాటరీ పద్ధతిలో 6వ తరగతి లో ప్రవేశం కొరకు మరియు 7వ తరగతి, 8వ తరగతులలో మిగిలియున్న సీట్ల భర్తీ కొరకు, అర్హులైన బాలబాలికల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 7వ తరగతి, 8వ తరగతి లో మిగిలి ఉన్న సీట్ల వివరాలు మరియు రిజర్వేషన్ల నియమాలు అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరచబడినవి, ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్సైట్ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్ను చదవండి. అర్హత ప్రమాణాలు: 2020-21 విద్యాసంవత్సరంలో 5వ తరగతి మరియు 6వ తరగతి, 7వ తరగతి ఇంగ్లీష్/ తెలుగు మీడియంలో చదివిన గిరిజన బాలబాలికలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆశ్రమ, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. ఆదాయం: తల్లిదండ్రులు వార్షిక ఆదాయం 1లక్ష రూపాయలకు మించకూడదు. ప్రవేశం పొందే సమయంలో విద్యార్థులు సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలు: 1. కుల ధ్రువీకరణ పత్రము, 2. ఆదాయ ధ్రువీకరణ పత్రము, 3. రేషన్ కార్డు, 4. ఆధార్ కార్డు, 5. మార్కుల మెమో, 6. స్టడీ సర్టిఫికేట్,