Railway 3115 JOBs 2023 | పోటీ పరీక్ష లేకుండా 3115 రైల్వే పోస్టుల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
10 పాస్ తో ITI సర్టిఫికెట్ కలిగి ఉన్నవారికి శుభవార్త! రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్.ఆర్.సి, ఈస్టర్న్ రైల్వే (ఈ ఆర్), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 3115 అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత అర్హత ప్రమాణాలు కలిగి ఉన్న (రాష్ట్ర/ కేంద్ర పాలిత) ప్రాంత భారతీయ అభ్యర్థులు ఈ ఖాళీల కోసం దరఖాస్తులు ఆన్లైన్ విధానం లో చేయవచ్చు.. ఈ అప్రెంటీస్ పూర్తి చేసిన వారికి ఓపెన్ మార్కెట్లో క్యాటగిరి లెవెల్ -1, విభాగంలో ( ₹.18,000/- నుండి ₹.56,900/- ) వరకు జీతంతో రైల్వేలో ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. మరియు రైల్వే రిక్రూట్మెంట్ లో సంబంధిత విభాగంలో అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు 20% వరకు వెయిటేజి లను కల్పిస్తూ ప్రాధాన్యతనిస్తారు. అప్రెంటిస్షిప్ చట్టం 1961 & అప్రెంటిషిప్ రూల్ 1962 ప్రకారం నోటిఫికేషన్ లోని 3115 సీట్లను భర్తీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా.. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, విభాగాల వారీగా ఖాళీలు, లో ముఖ్య తేదీలు మొదలగు పూర్తి వివరాలు మీకోసం... ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 3115