రాత పరీక్ష లేకుండా! అకౌంటెంట్, ప్రోగ్రామర్, ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AP District Medical Staff Recruitment 2023 Download Application Form here..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, అనంతపురం జిల్లా మెడికల్ ఆఫీస్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మెడికల్ ఆఫీసర్, అకౌంటెంట్, ప్రోగ్రామర్ తదితర పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి పరిమిత సమయం మాత్రమే ఉన్నది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఐదు రోజుల పరిమితి లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. దరఖాస్తులు ప్రారంభ తేదీ:21-08-2023, దరఖాస్తులకు చివరి తేదీ:25-08-2023. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ను జిల్లా వెబ్ సైట్ ను సందర్శించి చదవండి. ఆఫ్లైన్ అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ కు సంబంధించినటువంటి లింక్స్ క్రింద ఉన్నాయి చుడండి.
పోస్టుల వివరాలు:- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ డిటిపి - 01,
- జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ - 01,
- సీనియర్ డిఆర్ టిబి/ టీబీ హెచ్ఐవీ సూపర్వైజర్ - 01,
- జిల్లా పిపిఎం(పబ్లిక్ ప్రైవేట్ మిక్స్) కోఆర్డినేటర్ - 01,
- అకౌంటెంట్ - 01.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్లో డిగ్రీ/ ఎంబిఏ/ పీజీ డిప్లమా/ పీజీ సర్టిఫికెట్ కోర్స్ లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు హరి తేది నాటికి అభ్యర్థుల వయసు 52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బిసి అభ్యర్థులకు 05 సంవత్సరాలు.
- ఎక్స్ సర్వీస్ మెన్ లకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,233/- నుండి రూ.61,960/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :-21-08-2023 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :-25-08-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment