Harivillu Programm Joyfull Learning Session-1-5‖ Introduction to Harivillu ‖ హరివిల్లు లెవెల్-1 & లెవెల్-ఈఈ మాడ్యూల్‖ ఆట పాటల బోధన 'హరివిల్లు' కార్యక్రమం..
ఆటపాటలతో బోధన
చిన్నారుల పాఠ్యప్రణాళికలో కథలు, నృత్యాలు
18 వేల పాఠశాలల్లో హరివిల్లు పేరుతో అమలు
నేటి నుంచి (06.04.2021 నుండి 10.04.2021 వరకు) ఉపాధ్యాయులకు వర్చువల్ శిక్షణ..
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు సంతోషంగా విద్యను నేర్చుకునే వాతావరణాన్ని కల్పించేందుకు విద్యాశాఖ వేగంగా అడుగులు వేస్తున్నది. కథలు, పాటలు, నృత్యాలు, ఆటలు, బొమ్మలతో పాఠాలు చెప్పే విధానం పై ఉపాధ్యాయులకు మంగళవారం(06.04.2021) నుండి ఆన్లైన్ శిక్షణ ఇవ్వను ప్రారంభించింది.
'హరివిల్లు' పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆనందమయ విద్యా ప్రణాళికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే మహబూబాబాద్, వికారాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేశారు.
⟫ తప్పక చదవండి: SSC Study material 2021 By SCERT ‖ తెలంగాణ ఎస్‌సిఈఆర్‌టి వారు రూపొందించిన 10వ తరగతి అన్నీ సబ్జెక్టుల అభ్యాస దీపికను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.
ఛత్తీస్ గడ్ లో పరివర్తన్,
ఢిల్లీలో హ్యాపీనెస్ క్లాస్,
ఆంధ్రప్రదేశ్ లో ఆనందవేదిక పేరుతో జాయి ఫుల్ లెర్నింగ్ ను అమలు చేస్తున్నారు. ఇదే తరహాలో మన రాష్ట్రంలో హరివిల్లు పేరుతో ప్రవేశపెడుతున్నారు. ఉపాధ్యాయులకు బోధన ప్రణాళిక, బోధన విధానా లపై మంగళవారం (06.04.2021) నుంచి ఐదు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 18 వేలు ఉన్నాయి. వీటిల్లో 68 వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక మాడ్యూల్స్ తయారు చేశారు.
1-2 తరగతికి లెవెల్-1
3-4 తరగతులకు లెవెల్-2 పేరుతో మాడ్యూల్స్ అభివృద్ధి చేశారు. దీనికి దాల్మియా గ్రూప్ కు చెందిన బ్లూ ఆర్బ్ ఎన్జీవో సహాకారం అందించింది. ఇప్పటికే 594 మండలాల నుంచి ఇద్దరు చొప్పున 12 వేల మంది రిసోర్స్ పర్సన్ లకు శిక్షణ ఇచ్చారు మిగితా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
⟫ తప్పక చూడండి: PPC2021 ‖ పరిక్ష పె చర్చా - 2021 ‖ గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తో ప్రత్యేకమైన ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. క్లిక్ చేసి చూడండి.
రోజువారీ కార్యక్రమాలు
సోమవారం: మానసిక సంసిద్ధత (శ్వాస శరీరం పై అవగాహన).
మంగళవారం: కథా సమయం. ఉపాద్యాయుడు
బుధవారం: కథా సమయం. పిల్లలు
గురువారం: కృత్య సమయం.
శుక్రవారం: కృత్య సమయం.
శనివారం: సమన్వయ కృత్యాలు, (1-2 తరగతులకు), & భావవ్యక్తికరణ (3-5 తరగతులకు).
Harivillu Programm Joyfull Learning Session-1 Introduction👇
Harivillu Programm Joyfull Learning Session-2 Mindfulness👇
Harivillu Programm Joyfull Learning Session-3 Stories👇
Harivillu Programm Joyfull Learning Session-4 Activities👇
Harivillu Programm Joyfull Learning Session-5 Expressions (Level-1) & Milling Activities (Level-2)👇
హరివిల్లు జాయ్ ఫుల్ల్ లర్నింగ్ మాడ్యూల్ లెవెల్-1👇
హరివిల్లు జాయ్ ఫుల్ల్ లర్నింగ్ మాడ్యూల్ లెవెల్-2👇
Comments
Post a Comment