TSAR Registration Process || Step by Step Guide Available Here || ఉపాధ్యాయుల స్వీయ మదింపు రిజిస్ట్రేషన్ సోపానాలు...
TSAR
TEACHERS SELF ASSESSMENT RUBRICS
ఉపాధ్యాయుల స్వీయ మదింపు
http://183.82.97.97:8020/tsarts
పై లింకు ను క్లిక్ చేయండి.
➥ అదికారిక TSAR వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
➥ ఇక్కడ Register without OTP టాప్ చేయండి.
➥ User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
➥ ఫస్ట్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ను ఎంటర్ చేయండి.
➥ సెకండ్ ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ను ఎంటర్ చేయండి.
➥ మీకు ఇష్టమైనటువంటి ఒక పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
➥ రజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు వారి మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
➥ లాగిన్ చేయగానే TSAR యొక్క అదికారిక హోం పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ ముందుకు వెళ్ళాలి.
👉 మొదటిది profile సెక్షన్.
ఈ సెక్షన్ లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇచ్చిన ట్రెజరీ ఐడి ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న వివరాలను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే edit ఆప్షన్ ను సెలెక్ట్ చేసి సవరణలు చేసుకోవాలి.అన్ని సరిగా ఉంటే ఏ మార్పులు చేయనవసరం లేదు.
ఉపాధ్యాయుని పేరు, పుట్టిన తేదీ, కులము, ట్రెజరీ ఐడి, మండలం,జిల్లా, పాఠశాల పేరు మండలం జిల్లా మొదలైన వివరాలు ఇక్కడ కనిపిస్తాయి.
తప్పక చదవండి: TSAR (Teacher Self Assessme Rubrics) || ఆన్లైన్ శిక్షణా కార్యక్రమం పూర్తి సమాచారం. మరియు సంభందిత అన్నీ మాడ్యూల్స్ ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.
👉 రెండవది Academic qualifications
ఈ సెక్షన్ లో ఉపాధ్యాయులు తమ యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్(Fill) చేయవలసి ఉంటుంది. హైయెస్ట్ క్వాలిఫికేషన్, పాస్ అయినటువంటి యూనివర్సిటీ పేరు, సంవత్సరం మరియు చదివిన సబ్జెక్టుకు సంబంధించిన వివరాల డేటా ను సేవ్ చేయాలి.
ఈ విధంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు M.SC పూర్తి చేసి, ఆ తర్వాత MA కూడా పూర్తి చేసినట్లయితే రెండు క్వాలిఫికేషన్స్ సేవ్ చేసుకోవచ్చు.
First ఒక క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
తరువాత add బటన్ పై క్లిక్ చేసి మరొక క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేయాలి.
👉 మూడవది Professional qualifications
ఈ సెక్షన్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలను నింపాలి. ఉపాధ్యాయుడు పూర్తిచేసిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాల డేటాను సేవ్ చేసుకోవాలి.
B.Ed తో M.Ed క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు రెండింటి డేటా ను సేవ్ చేయవచ్చు.
👉 నాల్గవది Experience
ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు తమ యొక్క, Experience వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయుడు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి అనుభవం(Experience) పూర్తయిన సంవత్సరాలు మరియు నెలల లో డేటాను, ఏ కేటగిరీ పోస్టులో( SGT, SA, GHM, LFLHM) ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశారో ఆ వివరాలు సేవ్ చేయాలి. ఒక్కో కేటగిరీ వారీగా వివరాలు నింపాలి.
👉 ఐదవది In service
ఈ సెక్షన్ లో ఉపాధ్యాయులు గత మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన శిక్షణలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయవలసి ఉంటుంది.
ఏ రకమైనటువంటి శిక్షణను ఎన్ని నెలలు తీసుకున్నారు.
శిక్షణ యొక్క స్థాయి( మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ), ఉద్దేశ్యాలు, లక్ష్యాల విరాలను ఎంటర్ చేసి సేవ్ చేయండి.
ఇది కూడా చదవండి: Harivillu Programm Joyfull Learning Session-1-5‖ Introduction to Harivillu ‖ హరివిల్లు లెవెల్-1 & లెవెల్-ఈఈ మాడ్యూల్‖ ఆట పాటల బోధన 'హరివిల్లు' కార్యక్రమం..
👉 ఆరవది Classes taught
ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి తరగతులు, సబ్జెక్టులకు సంబంధించినటువంటి వివరాలను ఎంటర్ చేయాలి.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అన్ని తరగతులు (1-5th) మరియు అన్ని సబ్జెక్టులను ( తెలుగు, ఇంగ్లీష్, గణితం,ప.వి) ఎంపిక చేసుకోవాలి.
హైస్కూల్ ఉపాధ్యాయులు వారు బోధిస్తున్నటువంటి తరగతి మరియు సబ్జెక్టులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.
GHM లు ఏదైనా సబ్జెక్టును బోధించినట్లు అయితే వారు కూడా ఆయా వివరాలను సేవ్ చేసుకోవచ్చు.
ఉపాధ్యాయుల యొక్క అదనపు బాధ్యతలు, (ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నభోజనం, పరీక్షల నిర్వహణ, బాలల సంఘాలను కోఆర్డినేట్ చేయడం, లైబ్రరీ పుస్తకాల నిర్వహణ, హరితహారం మొదలైనవి అదనపు బాధ్యతలు) వివరాలు నమోదు చేయాలి.
ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి అవార్డులకు సంబంధించిన వివరాలను (మండల జిల్లా, జాతీయ స్థాయి, అవార్డుల వివరాలు) ఎంటర్ చేసి, సేవ్ చేయవలసి ఉంటుంది.
👉 ఎడవది Teachers performance
ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు సెల్ఫ్ అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు గుర్తించిన సమాధానాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడుతుంది. ఉపాధ్యాయులు తమ యొక్క సొంత ప్రతిస్పందనలు మాత్రమే నమోదు చేయాలి.
👉 ఎనిమిదవది Descriptive feedback
ఈ సెక్షన్లో మొత్తం 9 Performance Standards ఉంటాయి.
ఉపాధ్యాయుడు ఒక్కో అంశాన్ని ఎంపిక చేసుకుంటూ ఆయా/ సంభందిత Standards లో వారి బలాలు, బలహీనతలు, వాటిని అధిగమించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి నటువంటి వివరాలను ఎంటర్ చేసి డేటాను సేవ్ చేయాలి.
సూచన: అన్ని అంశాలలో వివరాలను నమోదు చేసిన తర్వాత వెంటనే ఫైనల్ సబ్మిట్ చేయవద్దు.
మీరు నమోదు చేసిన వివరాలను ఒకటి లేదా రెండు సార్లు సరిచూసుకోండి. ఎంటర్ చేసినటువంటి వివరాలు సరైనవని నిర్ధారించు కున్న తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి.
ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు డేటాను ఎన్నిసార్లైనా ఎడిట్ చేసి మార్చడానికి అవకాశం ఉంటుంది.
సబ్మిట్ చేసిన తర్వాత మార్చడానికి అవకాశం ఉండదు...
First Day Live Streaming 'TSAR' Program Video watch here👇
అదికారిక వెబ్ సైట్ లింక్: http://183.82.97.97:8020/
⟫తప్పక చదవండి: Shaala Siddhi Evaluation | NPSSE | తెలంగాణ సమగ్ర శిక్షా, హైదరాబాద్ "శాల సిద్ది" అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలల స్వయం మూల్యాంకనం 2020-21. పూర్తి వివరాలివే...
Comments
Post a Comment