UPSC Civil Service | సివిల్స్ ప్రిలిమ్స్ 2021 ప్రేపరేషన్ ప్లాన్ | విజేతల విజయమంత్రం. ‖తప్పక తెలుసుకోండి...‖
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రణాళిక
ట్రెండ్ అర్థమైతే సక్సెస్ సాధ్యమే
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ - 2021 విడుదలైంది. ఈ సంవత్సరం 712 పోస్టులు ఉన్నాయి.
జూన్ 27న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగనుంది. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తొలిసారిగా రాస్తున్న అభ్యర్థుల నుంచి ఇప్పటికే మూడు రెండు సార్లు హాజరైన వారి వరకు దాదాపు అందరిలోనూ పరీక్ష కోసం అనుసరించాల్సిన వ్యూహంపై రకరకాల సందేహాలు మొదలవుతుంటాయి.
👉 తప్పక చదవండి : UPSC Civil Services Examination 2021 Notification Released | మొత్తం 712 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: మార్చి 24, 2021.
➥ గతంలో వేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు అనుసరించవచ్చా?
➥ లేదంటే మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా ప్రణాళికల్లో కూడా మార్పు ఉండాలా?
➥ అని ఆలోచిస్తుంటారు.. అయితే పరీక్షకు దాదాపు వంద రోజుల గడువుంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రిలిమ్స్ పరీక్షను సులువుగా గట్టెక్కవచ్చు.
ప్రిలిమ్స్ పరీక్షలో సక్సెస్ కు ఈ మూడు దశల్లో సన్నద్ధత వహించాలి.
1. వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవడం.
2. నేర్చుకున్న అంశాలను పరీక్షించుకోవడం.
3. ఈ పరీక్షలో వచ్చిన ఫలితాల ఆధారంగా సమీక్ష చేసుకోవడం.
ఈ మూడు అంశాలను సమగ్రంగా అనుసంధానం చేయగలిగితే తదుపరి అంశానికి చేరుకోవచ్చు.
వివిధ అంశాలపై అవగాహన:
➥ సివిల్స్ కోసం సిద్ధమవుతూ పరీక్ష రాయాలనుకుంటున్నాను అభ్యర్థులు సిలబస్ ను ఇప్పటికే కనీసం ఒక్కసారైనా చదివి ఉంటారు..
➥ NCERT పుస్తకాలు కూడా చదివి ఉంటారు..
➥ ఒకవేళ ఈ పాఠ్య పుస్తకాలు చదివి ఉండకపోతే అంశాలకు సంబంధించిన మెటీరియల్ మార్కెట్లో దొరుకుతుంది ఇందులో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ సబ్జెక్టులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలి, ఇక మిగతా పుస్తకాలు చదువుతున్నప్పుడు ప్రాధాన్యం కలిగిన అంశాలను గుర్తించి వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఒక్కొక్క సబ్జెక్టులో ఎలాంటి ప్రణాళిక అవసరం ఇప్పుడు చూద్దాం...
చరిత్ర
➥ చరిత్రని మనకు ఇష్టం వచ్చిన రీతిలో చదవకూడదు.
➥ ప్రాచీన భారతదేశం నుంచి ఆధునిక భారతదేశం వరకు ఒక క్రమపద్ధతిలో చదవాలి.
➥ చరిత్ర చదువుతున్నప్పుడు ఆర్ట్స్ అండ్ కల్చర్ భాగాన్ని కూడా అనుసంధానిస్తూ చదివితే సమయం ఆదా అవుతుంది.
➥ అంతేకాకుండా సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.
➥ ఉదాహరణకు సింధు నాగరికతకు సంబంధించి ఆనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి చదువుతున్నప్పుడు ఆ కాలానికి సంబంధించి కళలు సంస్కృతి వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి.
➥ సాధారణ అభ్యర్థులు మధ్యయుగాల భారతదేశ చరిత్రని అశ్రద్ధ చేస్తుంటారు.
➥ అయితే, 2020 ప్రిలిమినరీ పరీక్షలో ఈ ఈ విభాగం నుంచి కూడా ప్రశ్నలు అధిక సంఖ్యలో వచ్చాయి.
➥ స్వాతంత్రోద్యమాన్ని కాస్త ప్రత్యేకంగా చదవాలి. ముఖ్యంగా ఈ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు ఏవైనా వందేళ్లు పూర్తి చేసుకున్నవి ఉంటే వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఉదాహరణ మోప్లా ఉద్యమం. ఆయా సంఘటనల చుట్టూ ఉండే అంశాలను కూడా అనుసంధానం చేయాలి.
జాగ్రఫీ
➥ గతంలో ఈ సబ్జెక్టు నుంచి ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు ఉదాహరణకు Climatology, Geomorophology, Oceanography వంటి అంశాల నుంచి ప్రశ్నలు నేరుగా వచ్చేవి.
➥ ఈ మధ్యకాలంలో అనువర్తిత ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు.
➥ ఉదాహరణకు ఫలానా రకం మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతున్నాయి అని అడిగారు.
➥ అలాగే వార్తల్లో ఉన్న భౌగోళిక ప్రాంతాల పైన దృష్టి పెట్టాలి.
➥ ఉదాహరణకు అడవుల కారణంగా ఆమెజాన్, వరదలు కారణంగా ఉత్తరాఖండ్ వార్తల్లో ఉన్నాయి. వార్తల్లో ఉన్న సముద్రాలు, నదులు అవి ఎక్కడ ఉన్నాయి, వాటికి అనుసంధానంగా ఉన్న అంశాలేమిటో కూడా చదవాలి.
➥ భారత భౌగోళిక పరిస్థితుల పై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి.
➥ భారతదేశంలో వైవిధ్యమైన పరిస్థితిలో తెలిసి ఉండాలి.
పాలిటి
➥ పాలిటి చాలామంది దృష్టిలో చాలా సులువైన సబ్జెక్ట్. కానీ, సరైన రివిజన్ లేకపోతే ఎలాంటి వారైనా అంతే సులువుగా మర్చిపోయే ప్రమాదం ఉంది.
➥ సాధారణ అంశాలు మాత్రమే కాకుండా ఈ మధ్య రాజ్యాంగ తాత్విక కు సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
➥ ఉదాహరణకు స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న. ఇలాంటి వాటి కోసం Political theory పుస్తకం (11th Class NCERT) బాగా ఉపయోగపడుతుంది.
➥ అలాగే వార్తల్లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
➥ ఉదాహరణకు ద్రవ్య బిల్లు. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతాలు మొదలైన అంశాలు.
➥ ఎన్నికల కమిషనర్, అటార్నీ జనరల్ వంటి వాటి మధ్య పోలిక లకు సంబంధించి ఒక పట్టిక రూపొందించుకుని ఉండాలి.
➥ ఉదాహరణకు రెండింటి మధ్య తొలగింపు విధానంలో అనుసరించే ప్రక్రియ.
➥ రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించి అవగాహన ఉండాలి.
➥ ఆ క్రమంలో వివిధ సంస్థల మధ్య తేడా ఏంటో తెలియాలి.
➥ అలాగే 1919, 1935 చట్టాలకు సంబంధించిన అంశాలు. ఇక ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు గురించి తెలిసి ఉండాలి.
➥ ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పులు.
➥ రాజ్యాంగ సవరణలపై దృష్టి పెట్టాలి. రాజ్యాంగ నైతిక వంటి అంశాలపై అవగాహన ఉండాలి.
గవర్నన్స్
➥ దాదాపు ఏడాది ఏడాదిన్నర నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న వివిధ పథకాలు, వాటి లక్ష్యాలు తెలుసుకుని ఉండాలి.
➥ ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త విధానాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉదాహరణకు నూతన విద్యా విధానం.
ఎకానమీ
➥ ఈ సబ్జెక్ట్లో బ్యాంకింగ్ రంగం, ఆర్బిఐ చేపట్టిన నూతన అంశాలు, ఆర్థిక సర్వే లోని కీలక అంశాలు, బడ్జెట్, అలాగే దానికి సంబంధించిన పదజాలం తెలిసి ఉండాలి.
➥ ఈ సంవత్సరం లి ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య రంగం, మానవ వనరుల దృష్టిపెట్టాలి. దాదాపు ఏడాది కాలంలో వార్తల్లో ఉన్నటువంటి ఆర్థిక రంగానికి సంబంధించిన పదజాలాన్ని తెలుసుకొని ఉండాలి ఉదాహరణకు ఆ సెట్ రీ కన్ స్ట్రక్షన్ కంపెనీ.
ఎన్విరాన్మెంట్
➥ ఇందులో ఎకాలజీ, బయోడైవర్సిటీ, అగ్రికల్చర్ పై అవగాహన కలిగి ఉండాలి.
➥ ఇందులో కూడా ప్రాథమిక పదజాలం తెలిసివుండాలి.
➥ వాతావరణ మార్పులకు సంబంధించి వివిధ అంతర్జాతీయ కన్వెన్షన్ లు ప్రోటోకాల్ గుర్తుంచుకోవాలి.
➥ పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొత్త పథకాలు విధానాలు తెలిసి ఉండాలి (ఉదా: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) ఈ సబ్జెక్టుకు సంబంధించి NCERT పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.
➥ రామర్స్ సైట్లు బయోస్ఫియర్ రిజర్వులు, నేషనల్ పార్క్ లో తెలుసుకొని ఉండాలి.
➥ IUCN వర్గీకరణ, కొలంబో డిక్లరేషన్ ఇంకా వార్తల్లో ఉన్న అంశాలన్నీ చదువుకొని ఉండాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
➥ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది రాబోయే కాలంలో కీలక సేవలు అందించబోతున్నారు టెక్నాలజీలకు సంబంధించి అవగాహన ఉండాలి.
➥ ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని తీసుకుంటే ఇది ఆరోగ్యం, ఆర్ధికం, వైద్యం, విద్య, ఇలా రకరకాల రంగాల్లో ఏ విధమైన పాత్ర పోషించబోతున్నాయో తెలిసి ఉండాలి.
➥ అట్లాగే నానో టెక్నాలజీ టెక్నాలజీ, క్వాంటం డాటా టెక్నాలజీ, 3d ప్రింటింగ్ ఇలా అన్నింటిపై ప్రాథమిక అవగాహన అయినా కలిగి ఉండాలి. స్పేస్ అండ్ టెక్నాలజీ పై దృష్టి పెట్టాలి.
ఇంటర్నేషనల్ రిలేషన్స్
➥ ప్రాంతీయ గ్రూపులు వాటిలో భారత్ పాత్ర, అట్లాగే భారత్ లో వివిధ దేశాలు కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు, ఇటీవల వాణిజ్య ఒప్పందాలు, సమావేశాలు ఓసారి చూసుకోవాలి. అట్లాగే వార్తల్లో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు. వాటి లక్ష్యాలు వంటివి చదవాలి.
➥ ఉదాహరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార సంస్థ.
సెక్యూరిటీ
➥ భారత్ ఇతర దేశాలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన విన్యాసాలు, రక్షణకు సంబంధించి ఇతర దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాలు.
➥ మనదేశం సమకూర్చుకున్న ఆయుధాలు, నౌకలు,జలాంతర్గామూలకు సంభందించిన సమాచారం తెలుకుని ఉండాలి.
రెండో దశ.. పరీక్ష దశ
➥ ఈ దశలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
➥ ఇలా నమూనా ప్రశ్నపత్రాలను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా వివిధ ప్రయోజనాలున్నాయి.
➥ ప్రశ్న పత్రాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది.
➥ టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది.
➥ ప్రిపరేషన్ లో ఎక్కడ వెనుకబడ్డారు తెలుస్తుంది.
➥ పేపర్ స్థాయి అర్థమవుతుంది.అంతిమంగా ప్రధాన పరీక్షకు సిద్ధం చేస్తుంది.
చివరిదశ.. సమీక్ష
➥ ఏ సబ్జెక్టు లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎంత టైం లో పూర్తి చేస్తున్నాం, ఇలా ఒక్కో అంశాన్ని సమీక్షించుకుని లోపాన్ని సరి చేసుకోవాలి.
➥ ఈ వంద రోజుల్లో వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించడం ద్వారా మెరుగైన ఫలితం పొందవచ్చు.
➥ పరీక్షకు 20-30 రోజుల ముందు కొత్త అంశాలు చదువుకోవడం మంచిది.
➥ అప్పటి వరకు చదివిన అంశాలనే పదేపదే రివిజన్ చేసుకోవాలి లేకపోతే అప్పటివరకు చదివినవే కాస్త మర్చిపోయే ప్రమాదం ఉంది. సన్నద్ధతకు సంబంధించి ప్రణాళిక ఎలా ఉన్నా సరే పగలు రాత్రి సరైన నిద్ర లేకుండా అదే పనిగా చదవకూడదు. రోజు కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజు వారి ప్రణాళిక ఉండాలి.
➥ సమయపాలన కూడా అవసరం అనవసర ఒత్తిడిని కొంతమేరకు తగ్గిస్తుంది ఇదే విజేతల విజయ మంత్రం.
All the Best
Latest JOBs కోసం చదవండి
Comments
Post a Comment