TVVP Recruitment 2022 | TS District Hospital inviting Applications for various Outsourcing posts | Check eligibility, salary and more Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ వైద్య విధాన పరిషత్(TVVP) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసి, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది..
ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.22,750/- జీతం గా చెల్లిస్తారు..
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ 26.11.2022 సాయంత్రం 05:00 గంటలకు ముగియనుంది.
తప్పక చదవండి :: Indian Govt JOBs 2022 | 10వ తరగతి, డిగ్రీ పాస్ తో.. కేంద్ర ప్రభుత్వ శాశ్వత కొలువులు.. పూర్తి వివరాలు ఇక్కడ..
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగ నియామకాలు-2022:
సుపరిటెండెంట్ కార్యాలయం :: డిస్టిక్ హెడ్ కోటర్ హాస్పిటల్ :: భద్రాద్రి కొత్తగూడెం, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్, మరియు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి.. ఆసక్తి కలిగిన లోకల్ ఏరియా అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్రాఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.11.2022 ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభమైనది, 26.11.2022 సాయంత్రం 05:00 గంటలకు దరఖాస్తులు స్వీకరిస్తారు.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫార్మసిస్ట్ గ్రేడ్-2 - 02,
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 - 02.. మొదలగునవి.
తప్పక చదవండి :: B.E/ B.Tech/ B.Sc(Engg)/Diploma అర్హతతో 800 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
◆ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలకు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ అర్హతతో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
◆ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాలకు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిఎంఎల్టి/ బి.ఎస్సి ఎంఎల్టి అర్హతతో తెలంగాణ రాష్ట్రం పారం మెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
◆ 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి..
◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలను మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తింపజేశారు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
తప్పక చదవండి :: జిల్లా ప్రభుత్వ కాలేజీలో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు పూర్తి విధానం ఇక్కడ..
ఎంపిక విధానం:
◆ మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఈ నియామకాలు ఉంటాయి.
◆ అకాడమిక్, టెక్నికల్ విద్యార్హతలు కనపర్చిన ప్రతిభకు 90 మార్కులు.
◆ ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన అనుభవానికి 10 మార్కులు. @ సంవత్సరానికి 2 మార్కుల చొప్పున లెక్కిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.22,750/- ప్రతి నెల జీతం గా చెల్లించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
తప్పక చదవండి :: తెలంగాణ, వికలాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.11.2022 ఉదయం 10:30 గంటల నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.11.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.







ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్సైట్ లింక్ : https://kothagudem.telangana.gov.in/
◆ అధికారిక హోమ్ పేజీలోని నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి, నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేయండి.
◆ దరఖాస్తులు పేర్కొన్నటువంటి అర్హత ధ్రువపత్రాల కాపీలపై సెల్ఫ్ అటిస్టెడ్ (లేదా) గెజిటెడ్ సంతకం చేయించి, దరఖాస్తుకు జత చేసి నేరుగా (లేదా) రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు..
◆ అభ్యర్థులు తప్పనిసరిగా ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో ఎన్వలప్ కవర్ పై పెద్ద అక్షరాలతో రాయాలి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా:
Superintendent, District Head Quarters Hospitals, Bhadradri Kothagudem District, Government General Hospital, Bhadradri Kothagudem Campus, Kothagudem - 507101.
అధికారిక వెబ్సైట్ :: https://kothagudem.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment