TS CPGET - 2022 Results Out | తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
TS CPGET ఫలితాలు 2022:
ఉస్మానియా విశ్వవిద్యాలయం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో ఈరోజు 3:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చైర్మెన్ లింబాద్రి మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం వి.సి డి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్ట్ 11 & 12, 2022 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
TS CPGET 2022 ఈ పరీక్షలకు సుమారు 5,87,262 మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం దాదాపు 45 సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రామ్స్ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం మరియు డిప్లమా ప్రోగ్రాంలతో సహా మొత్తం 50 కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ విధానం ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జోహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.
TS CPGET - 2022 ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులు జూన్ 6, 2022 నుండి ప్రారంభమై జులై 7న ముగిశాయి.. తాజా సమాచారం ఆధారంగా ఫలితాలను తాజాగా ఈ (20.09.2022) ఈరోజు విడుదల చేసింది.







TS CPGET -2022 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://cpget.tsche.ac.in/
◆ తదుపరి Home పేజీలోని Application ఈ విభాగంలో కింద కనిపిస్తున్న TS CPGET - 2022 Results లింక్ పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్టికెట్ నెంబర్, నమోదుచేసి Submit పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత, ఫలిత ఫైల్ ఓపెన్ అవుతుంది.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: https://cpget.tsche.ac.in/
ఇప్పుడే ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment