బీటెక్ పూర్తి చేశారా! 327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త!
బీటెక్ ఎంఎస్సీ డిప్లమా పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది, 327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 కోసం అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూపీఎస్సీ దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే టెలికాం డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఇంజినీర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 4న ముగియనుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 327.
విభాగాలు:
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇంజనీరింగ్ మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి డిప్లమా, బీఈ, బీటెక్ (సంబంధిత బ్రాంచ్ లో) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
జనవరి 1, 2020 3 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
◆ స్టేజ్ - 1 (ప్రాథమిక పరీక్ష)
◆ స్టేజ్ - 2 (మెయిన్స్ పరీక్ష)
◆ స్టేజ్ - 3 (పర్సనాలిటీ టెస్ట్)
పరీక్ష సెంటర్ల వివరాలు:
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విశాఖపట్టణం, తిరుపతి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
మహిళ/ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఇతరులకు రూ.200/-.







ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 04.10.2022.
ప్రిలిమినరీ/ స్టేజ్ -1 పరీక్ష తేదీ : 19.02.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment