TSPSC DAO 53 Vacancies Recruitment 2022 | TSPSC నుండి డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. పూర్తి వివరాలివె..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ విభాగంలోని 53 ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 17వ తేదీ నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ ఉద్యోగాలకు ప్రారంభ జీవితం ₹.45,960. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల సంఖ్య, మల్టీజోన్ల వారీగా ఖాళీలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 53
జోన్ల వారీగా ఖాళీల వివరాలు:
మల్టీ జోన్-1 లో - 28,
మల్టీ జోన్-2 లో - 25..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉన్నవారు(ఎలాంటి MATHS బ్యాక్ గ్రౌండ్ లేని వారు కూడా) ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
వయో-పరిమితి:
జూలై 1 2022 నాటికి 18 - 44 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి.
అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తింపజేశారు.. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ను పూర్తిగా చదవండి..
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు ₹.200/-.
పరీక్ష ఫీజు ₹.120. ఇలా మొత్తం ₹.320/-.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు దరఖాస్తు ఫీజు మినహాయించింది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 06.09.2022.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, పిఈటి టెస్ట్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా నిర్వహిస్తారు.
◆ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ నిజామాబాద్ జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
◆రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
◆ పేపర్-1: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు అడుగుతారు.
◆ ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
◆ పరీక్ష సమయం 150 నిమిషాలు..
◆ పేపర్-2: అర్ధమెటిక్స్ మరియు మెన్సురేషన్ (పదవ తరగతి సిలబస్ అణుగుణంగా) అంశాల నుండి మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు.
◆ ప్రతి ప్రశ్నకు 2 మార్కు కేటాయించారు.
◆ పరీక్ష సమయం 150 నిమిషాలు.
◆ ఇలా మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు..
★ రాత పరీక్ష వన్ తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాలలో ఉంటుంది.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment