TGUGCET Admissions 2023-24 | తెలంగాణ గురుకుల లో డిగ్రీ ప్రవేశాలు | Apply Online here..
![]() |
తెలంగాణ గురుకుల లో డిగ్రీ ప్రవేశాలు | Apply Online here.. |
2022-2023 విద్యాసంవత్సరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు శుభవార్త!
తెలంగాణ గిరిజన సంక్షేమ & సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల 2023-2024 విద్యా సంవత్సరానికి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న డిగ్రీ కాలేజ్ (TTWREIS -22, TSWREIS -30) డిగ్రీ కళాశాలల ఉమ్మడి రెసిడెన్సియల్ లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి, ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా(2022-23) లో ఇంటర్ చదువుతున్న విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. గ్రామీణ ప్రాంతాలలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచిత కార్పోరేట్ స్థాయి విద్యను అభ్యసించడానికి ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనవచ్చు. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యా వసతి తో పాటు ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ కు సంబంధించిన శిక్షణ లను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. పూర్తి సమాచారమైన, విద్యార్హత మరియు అందుబాటులో ఉన్న డిగ్రీ గ్రూప్స్, పరీక్ష విధానం, మొదలగు పూర్తి వివరాలు దరఖాస్తు ప్రక్రియ మీకోసం.
గిరిజన సంక్షేమ & సాంఘిక సంక్షేమ (TTWREIS-TSWREIS) రెసిడెన్సియల్ కళాశాలలో అందుబాటులో ఉన్నటువంటి గ్రూపుల పేర్లు:
1. బిఎ (హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్),
2. B.Com (కంప్యూటర్ అప్లికేషన్స్),
3. B.SC (ఎంపీసీ-మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్),
4. B.Sc (ఎంపీసిఎస్-మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, జియాలజీ),
5. B.Sc(ఎంజెడ్ సి-మైక్రో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జియాలజీ),
6 B.Sc (బి జెడ్ సి-బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్),
7. M.Sc (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ).
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
అర్హత ప్రమాణాలు :
2022-2023 విద్యాసంవత్సరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు.
✓ మార్చి 2023 లో నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలోపరీక్షలో 40% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
✓ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జాయిన్ అయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సరానికి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.1,50,000/- మించకూడదు. అలాగే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రూ.2,00,000/- మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
స్క్రీనింగ్ టెస్ట్ మెరిట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు విధానం మూడు దశల్లో జరుగుతుంది.
Step -1: రిజిస్ట్రేషన్& పేమెంట్,
Step -2: ఆన్లైన్ అప్లికేషన్,
Step -3: సబ్మిట్ ఆడర్ ఆఫ్ ప్రిఫరెన్స్..
దరఖాస్తు ఫీజు : రూ.150/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 05-01-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 11-02-2023 వరకు.
ప్రవేశ పరీక్ష తేదీ : 05-03-2023.
అధికారిక వెబ్సైట్ : https://www.tswreis.ac.in/ & https://www.tgtwgurukulam.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్:: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment