Artificial Intelligence in Inter ..‖ From the Robotics | Academic Year (2021-22) ‖ Courses List & other Details Available Here.
ఇంటర్ స్థాయి నుండి కృత్రిమ మేధ.. రోబోటిక్స్
కొత్తగా 9 రకాల స్వల్పకాలిక కోర్సుల ను కొత్త విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఎర్బాట్లు చేస్తుంది..
విద్యార్దులకు ఆధునిక సాం.కేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ఇంటర్ విద్యాశాఖ స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టేందుకు సమాయత్తమైంది. మొత్తం తొమ్మిది రకాల కోర్సులను కొత్త విద్యా సంవత్సరం(2021-22) నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఆ విదంగా అధికారులు ఇప్పటికే సిలబస్‌ను కూడా రూపొందించారు. పాఠ్యప్రణాళికను జేఎన్‌టీయూహెచ్ ఆచార్యులకు ఇచ్చిన ఇంటర్ విద్యాశాఖ వారి అభి ప్రాయాలను, సూచనలను స్వీకరించి తగిన మార్పులు చేయనుంది. 'భవిష్యత్తులో ఏ కోర్సు వారికైనా ఆయా సాంకేతికతలపై అవగాహన ఉండటం వల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.. ఉన్నత విద్యలో చేరినా అప్పటికే ఉన్న కొంత పరిజ్ఞానంతో సులభంగానేర్చుకోగలుగతారు' అని ఇంటర్ విద్యాశాఖ అధికారి గారు చెప్పారు..
ఇంటర్ స్థాయి లో ప్రవేశ పెట్టనున్న కృత్రిమ మేధ.. రోబోటిక్స్ కొత్త కోర్సులు ఇవీ..
1. కృత్రిమ మేధ,
2. మెషిన్ లెర్నింగ్,
3. రోబోటిక్స్,
4. బ్లాక్ చైన్ టెక్నాలజీ,
5. అగ్మెంటెడ్ రియాలిటీ,
6. కోడింగ్,
7. ఎంబెడ్ సిస్టమ్,
8. సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్,
9. ఇండస్ట్రియల్ ఆటోమేషన్,
తప్పక చదవండి : Career Guide 2021 for SSC Students ‖ ‘పదవ తరగతి’ తరువాత పయనమెటు! ‖ నిర్ణయం చేసే ముందు ఈ కెరీర్స్ గైడ్ ను చదవండి...
ఇంటర్‌లో స్థాయి లో ప్రవేశ పెట్టనున్న కృత్రిమ మేధ రోబోటిక్స్ విశేషాలు:
వివిద కోర్సులకు వివిద రకాలుగా ఉండేలా కాలవ్యవదిను. (3 నుండి 9 నెలలు) నిర్ణయించారు.
ఈ కోర్సులలో ప్రాక్టికల్స్ కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాక్టికల్స్, థియరీ లను 60:40 నిష్పత్తి లో ఉండేలా రూపొందింకారు.
తక్కువ ఫీజు కె ఈ కోర్సులను అందిస్తారు.
ఇంటర్ విద్యార్థులు ఏ బ్రాంచీ వారైనా వాటిని ఎంచుకచేసుకొని అభ్యసించవచ్చు.
అన్నీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురా నున్నారు.
భవిష్యత్తులో ఈ స్వల్పకాలిక కోర్సులను పూర్తి కాల కోర్సులుగా మార్చానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఒకేషనల్ కోర్సులలో ఎలాంటివి చాలా ఉన్నవి..
ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ఉన్న విద్యార్హత తో ఏదో ఒక టెక్నికల్ కోర్సు ను తప్పనిసరి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సరైన కోర్సులను ప్రవేశపెడుతుంది. విద్యార్దులలో ఈ విషయాలను మరింత త్వరగా చేరవేయాలి. ఆ దిశలో విద్యార్థులు ప్రోస్తహించాలని విద్యాశాఖ సన్నాహలు చేస్తుంది.
తప్పక చదవండి : TSBIE Launches Career Guidance Portal | విద్యా, ఉద్యోగ సమాచారంతో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్.. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Comments
Post a Comment