TSBIE Launches Career Guidance Portal | విద్యా, ఉద్యోగ సమాచారంతో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్.. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇంటర్ విద్యార్థుల కోసం పోర్టల్
• విద్యా, ఉద్యోగ సమాచారంతో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ ప్రారంభించిన ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
➥ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు టీఎస్ సీఐఈ కెరీర్ పోర్టల్ విద్యా, ఉద్యోగ, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.
➥ కాంపస్ క్రాప్ ఆధ్వర్యంలో రూపొందించిన కెరీర్ గైడెన్స్ పోర్టల్ ను సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ప్రారంభించారు.
తప్పక చదవండి : Career Guide 2021 for SSC Students ‖ ‘పదవ తరగతి’ తరువాత పయనమెటు! ‖ నిర్ణయం చేసే ముందు ఈ కెరీర్స్ గైడ్ ను చదవండి...
➥ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 లక్షల మంది ఇంటర్ ద్వితయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ తరువాత ఏ కోర్సు ఎంచుకోవాలి? ఉన్నత చదువులు ఏం చదవాలి? జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలు ఏమున్నాయి? వాటికి ఎలా సన్నద్ధం కావాలి? తదితర విద్యా, ఉద్యోగ సమాచారాన్ని ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంటుందని అన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
➥ పోర్టల్ అడ్రెస్ www.tscie.campuscrop.in అందులో కాలేజీలు, విద్యార్థులు ఈ నెలాఖరులోగా రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పారు.
➥ దీనికోసం క్యాంపస్ క్రాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు.
➥ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఆ సంస్థ ఉచితంగా సైకోమెట్రిక్ టెస్టు నిర్వహించి వారు ఏ కోర్సు చదివితే బాగుంటుందన్న విషయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తెలియజేస్తారని వివరించారు.
➥ అయితే ఆ కౌన్సెలింగ్ కు కనీస చార్జీలు ఉంటాయని తెలిపారు. అలాగే వెబ్ సైట్ లో కోర్సులకు సంబంధించిన సమాచారం ఉంటుందన్నారు.
➥ ఇక విద్యార్థుల కెరీర్ కౌన్సెలింగ్,మెటీరియలకు రూ.999 నుంచి రూ.2,999 వరకు చార్జీగా నిర్ణయించినట్లు తెలిసింది.
తప్పక చదవండి : ఇంటర్ స్థాయి నుండి కృత్రిమ మేధ.. రోబోటిక్స్ కోర్సులు | విద్యాసంవత్సరం(2021 22) నుండి ప్రారంభించడానికి ఎర్బాట్లు.. పూర్తిగా తెలుసుకోండి.
Comments
Post a Comment