BHEL 150 Engineer Executive Trainee Recruitment 2022 | BHEL 60 వేల జీతంతో 150 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
బీటెక్ విద్యార్థులకు శుభవార్త!
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 150 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన!
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో 60 వేల వరకు జీతం.. దరఖాస్తు చేయండిలా..
భారత ప్రభుత్వానికి చెందిన, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) బీటెక్ విద్యార్హతతో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. నోటిఫికేషన్ ప్రకారం ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగాలలో 150 ఖాళీలు ఉన్నాయి.. ఆసక్తి కలిగిన భారతీయ యువకులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి, పోటీపడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, రాత పరీక్ష అంశాలు.. మొదలగు పూర్తి వివరాలు ముఖ్య తేదీలతో మీకోసం..
ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య :: 150.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో - 40,
◆ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో - 30,
◆ ఐటి / కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో - 20,
◆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో - 15,
◆ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో - 10,
◆ మెటలర్జీ ఇంజినీరింగ్ విభాగంలో - 5,
◆ ఫైనాన్స్ విభాగంలో - 20,
◆ H R ఈ విభాగంలో - 10.. ఇలా మొత్తం 150 పోస్టులను ప్రకటించారు.
ఇంటర్, డిగ్రీ తో స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలు..
వయోపరిమితి:
సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు, ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ, అర్హతలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
◆ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, మెడికల్ పరీక్ష, ద్వారా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ పరీక్ష పేపర్ 100 మార్కులకు ఉంటుంది.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో రూ.60,000/-ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు తదుపరి బేసిక్ స్కేల్ పేర్ల ఆధారంగా అన్ని ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి.. జీతాలను చెల్లిస్తారు.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి/ ఎక్స్-సర్వీస్మెన్ లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు, ప్రాసెసింగ్ ఫీజు రూ.300/- చెల్లించాలి.
◆ అన్ రిజర్వుడ్/ డబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500/- + ప్రాసెసింగ్ ఫీజు రూ.300/- కలిపి మొత్తం రూ.800/- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.10.2022.
అధికారిక వెబ్సైట్ :: https://careers.bhel.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
ECE students eligible or not
ReplyDeleteEligible.
Delete