SAIL JOBs 2022 | టెన్త్, ఇంటర్, డిగ్రీ తో సెయిల్ 200 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి దరఖాస్తు విధానం మీకోసం.
నిరుద్యోగులకు శుభవార్త!
టెన్త్, ఇంటర్, డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వేర్వేరు విభాగాల్లో కలిపి మొత్తం 200 ట్రెయినీ పోస్టుల భర్తీ చేస్తుంది. భారత ప్రభుత్వానికి చెందిన, ఒడిస్సాలోని రౌర్కెలా లోని ఇస్మత్ జనరల్ హాస్పిటల్ లో ఈ కాళీ లు ఉన్నట్లు సమాచారం. ఒక సంవత్సరం పాటు శిక్షణ లను అందించడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులకు ఆగస్ట్ 5వ తేదీ నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 20 ను చివరి తేదీగా నిర్ణయించారు అలాగే ఇప్పటికే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా పూర్తి చేసిన వారు మరొకసారి దరఖాస్తు చేయడానికి అనర్హులుగా ప్రకటించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారమయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 200.
విభాగాల వారీగా ఖాళీలు:
◆ మెడికల్ అటెండెంట్ శిక్షణ - 100,
◆ క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్ - 20,
◆ అడ్వాన్స్డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ (ASNT) - 40,
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ట్రైనింగ్ - 06,
◆ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ శిక్షణ - 10,
◆ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ - 10,
◆ ఆపరేషన్ థియేటర్ అనస్తీసియా అసిస్టెంట్ ట్రైనింగ్ - 05,
◆ రేడియో గ్రాఫర్ శిక్షణ - 3,
◆ ఫార్మసిస్ట్ శిక్షణ - 3,
◆ అడ్వాన్స్డ్ ఫిజియోథెరఫీ శిక్షణ - 3 మొదలగునవి..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి టెన్త్ లేదా తత్సమాన, డిప్లమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వై ఫైరీ, ఇంటర్మీడియట్ తో పాటు PGDCA, డిప్లమా ఇన్ మెడికల్ లేబరేటరీ టెక్నాలజీ, ఇంటర్మీడియట్ తో పాటు హాస్పిటల్ అటెండెంట్ లేదా అనస్తీసియా, అటెండెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, డిప్లమా ఇన్ మెడికల్ రేడియేషన్ టెక్నాలజీ, డిప్లమా ఇన్ ఫార్మసీ లేదా బీఫార్మసీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ, ఎంబీఏ, బీబీఏ, పీజీ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లేదా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ముద్దులకు కోర్సులలో అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం:
పోస్టులను అనుసరించి వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసే అభ్యర్థులకు మెసేజ్, ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియపరచి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ₹.7000 నుండి ₹.17000 వరకు స్టైపెండ్ రూపంలో ప్రతినెలా చెల్లించారు.
దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ : http://igh.sailrsp.co.in/
◆ అధికారిక వెబ్ సైట్ లోని Apply for Trainee నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి నోటిఫికేషన్ పూర్తిగా చదివి నోటిఫికేషన్ లోని Online Application Form పై క్లిక్ చేయండి.
◆ అధికారిక దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది అభ్యర్థులు తమ వివరాలు పూర్తి చేయాలి.
◆ దరఖాస్తుల్లో తప్పనిసరిగా అడిగిన వివరాలను నమోదు చేస్తూ, దరఖాస్తును సబ్మిట్ చేయండి.
◆ భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్: http://igh.sailrsp.co.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2022.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment