NIMS Hyd - Data entry Operator and Lab-Techinican Recruitment - 2022 | హైదరాబాదులోని నిమ్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
నిరుద్యోగులకు శుభవార్త!
KVS టీచర్ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. పూర్తి వివరాలివే..
రాష్ట్ర రాజధాని హైదరాబాదు లోనే అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్ నిమ్స్(నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్), రాత పరీక్ష లేకుండా.. డాటా ఎంట్రీ ఆపరేటర్, లాబరేటరీ టెక్నీషియన్, రీసెట్ అసిస్టెంట్, సైంటిస్ట్ 'బి' ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తూ, ఆఫ్లైన్ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అక్టోబర్ 12వ తేదీ వరకు సమర్పించవచ్చు.
హైదరాబాద్ లో ఖాళీలు.. AWES - PGT, TGT, PRT Teacher Job Recruitment 2022 | ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ లో టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. వివరాలివే.
ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
తాజా విద్యా ఉద్యోగ సమాచారం ని ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ https://www.elearningbadi.in/ ను ఫాలో అవ్వండి/ మా వివిధ సోషల్ మాధ్యమ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 05.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
◆ డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01,
◆ లేబరేటరీ టెక్నీషియన్ - 02,
◆ రీసెర్చ్ అసిస్టెంట్ - 01,
◆ సైంటిస్ట్ 'బి' - 01.. మొదలగునవి.
విద్యార్హత:
డాటా ఎంట్రీ ఆపరేటర్ :: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ అర్హతతో.. కంప్యూటర్ పై గంటకు 15000 పదాలు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.18000/- జీతంగా చెల్లిస్తారు.
లేబరేటరీ టెక్నీషియన్ :: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ అర్హతతో.. మెడికల్ లేబరేటరీ టెక్నీషియన్ విభాగంలో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.18000/- జీతంగా చెల్లిస్తారు.
రీసెట్ అసిస్టెంట్ :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లైఫ్ సైన్స్ విభాగంలో ఎమ్మెస్సీ అర్హత కలిగి ఉండాలి.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.31,000/- జీతంగా చెల్లిస్తారు.
సైంటిస్ట్ 'బి' :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి మైక్రో బయాలజీ/ మాలిక్యులర్ బయాలజీ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
ఇంటర్, డిగ్రీ తో స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలు.. AP, TS Can Apply Online.
గౌరవ వేతనం :: ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.54,300/- జీతంగా చెల్లిస్తారు.
సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించే దరఖాస్తు తేదీనాటికి 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం ::
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ ప్రకటించాల్సి యున్నది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లకు తమకు సమాచారం అందించడం జరుగుతుంది.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆఫ్లైన్ సమర్పించాలి.
BHEL 60 వేల జీతంతో 150 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 12.10.2022 సాయంత్రం 04:00 గంటల వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా ::
The Dean
Nizam's Institute of Medical Science,
Panjagutta, Hyderabad - 500082, Telanga.
అధికారిక వెబ్సైట్ :: https://nims.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment