RCFL నుండీ 158 శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. భారతీయులందరూ అర్హులే. Vacancies Recruitment 2024 Apply Online here..
158 శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇక్కడ..
రాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో కెరియర్ ప్రారంభించాలని, వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లోమా అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ దరఖాస్తులు చేయవచ్చు..
భారతదేశంలోని ఎరువుల ఉత్పత్తి సంస్థల్లో నాలుగవ స్థానంలో ఉన్న, ముంబైలోని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL), తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి, మేనేజ్మెంట్ ట్రైనీ 155+ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ దిగువన ఇవ్వబడింది.. లింక్ ఆధారంగా 01.07.2024, సాయంత్రం 05:00 నాటికి లేదా అంతకంటే ముందు దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీలు వివరాలతో మీ కోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 158.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- మేనేజ్మెంట్ ట్రైనీ (కెమికల్) లో - 28,
- మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) లో - 30,
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) లో - 27,
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) లో - 18,
- మేనేజ్మెంట్ ట్రైనీ (సివిల్) లో - 04,
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైర్) లో - 02,
- మేనేజ్మెంట్ ట్రైనీ (సి సి ల్యాబ్) లో - 01,
- మేనేజ్మెంట్ ట్రైనీ (ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) లో - 03,
- మేనేజ్మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) లో - 10,
- మేనేజ్మెంట్ ట్రైనీ (హెచ్ ఆర్) లో - 05,
- మేనేజ్మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్) లో - 04,
- మేనేజ్మెంట్ ట్రైనీ (కార్పొరేట్ కమ్యూనికేషన్) లో - 03.. మొదలగునవి.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లోమా/ గ్రాడ్యుయేషన్(బీ.ఈ/ బీ.టెక్/ ఎం.బీ.ఏ) అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి 01.06.2024 నాటికి 21 నుండి 27 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;
- SC/ ST లకు 5 సంవత్సరాలు,
- OBC (Non-Creamy Layer) లకు 3 సంవత్సరాలు,
- PwBD లకు నిబంధనల ఆధారంగా..
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
- ఆన్లైన్ రాత పరీక్షలు ఈ క్రింది సెంటర్ లలో నిర్వహిస్తారు. అవి;
- హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, గుహ వటి, కలకత్తా, ముంబై, న్యూ ముంబై, తానే, భోపాల్ ఢిల్లీ, ఎం.సి.ఆర్ రీజియన్ లలో..
- రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉంటుంది.
- ఇంగ్లీష్/ హిందీ మాధ్యమాలలో ప్రశ్న పత్రం ఉంటుంది.
- మొత్తం 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ఇందులో పార్ట్-1, పార్ట్-2 రెండు భాగాలు ఉంటాయి.
- పార్ట్-1 లో డిగ్రీలో చదివిన అంశాల నుండి 50 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.
- పార్ట్-2 లో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ఇలా మొత్తం 150 మార్కులకు ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది.
- పరీక్షా సమయం 90 నిమిషాలు.
- ఆన్లైన్ రాత పరీక్షలో సాధించిన మార్కులకు 80% పర్సనల్ ఇంటర్వ్యూకు 20% వెయిటేజ్
- ఉంటుంది.
- రాత పరీక్షలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా 7:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ఉచిత వసతి, వైద్య సదుపాయాలతో శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో రూ.30,000/- వేతనంగా చెల్లిస్తారు.
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు వేతనం రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ఉంటుంది. అన్ని అలవెన్స్ లతో కలిపి దాదాపుగా రూ.80,000/- వరకు జీతాన్ని అందుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
- SC, ST, PwBD లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.06.2024 ఉదయం 08:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 01.07.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rcfltd.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
రాత పరీక్షలు విజయం సాధించడానికి ఇలా చేయండి.
- ఆన్లైన్ రాత పరీక్ష తేదీ ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ఇప్పటినుండే ప్రిపరేషన్ మొదలు పెడితే ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది.
- సంబంధిత సబ్జెక్టు నుండి 100 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి, చదివిన సబ్జెక్టు ల పై పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది.
- ఇప్పటినుండి ప్రత్యేక టైం టేబుల్ వేసుకొని, ప్రతిరోజు అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించి, కష్టతరంగా అనిపించిన సబ్జెక్టులకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ.. రీజనింగ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలను సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వాటికి ఎక్కువ కాలాన్ని వెచ్చించాలి.
- ప్రాక్టీస్ లో భాగంగా ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ రాయడాన్ని అలవాటు చేసుకోవాలి.
- నిర్ణీత సమయంలో ఎన్నీ ప్రశ్నలకు సమాధానం చేయగలుగుతున్నారో లేదో మీకే తెలుస్తుంది.
- అలాగే ఏ ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది. కాబట్టి దాన్నిబట్టి సన్నద్ధత ను మెరుగు పరుచుకోవచ్చు.
- కాంపిటేటీవ్ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఇలా చేయడం ద్వారానే సాధ్యమవుతుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment